Leopard Mother Video: ఈ వీడియో చూస్తే తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది.. అమ్మకు ప్రేమతో ..!

Leopard Mom Viral Video: ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు.. అనే డైలాగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ ప్రేమ కేవలం మనుషుల్లో మాత్రమే కాకుండా జంతువుల్లో కూడా సమానమే అని తెలిపే వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియోలు కనిపిస్తూంటాయి. అయితే ఓ తల్లి చిరుత తన పిల్లలను సింహం నుంచి రక్షించుకోవడం కోసం చేసిన పనిని చూసి నెటిజన్‌లు ఆశ్చర్యపోతున్నారు. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Nov 7, 2024, 02:03 PM IST
Leopard Mother Video: ఈ వీడియో చూస్తే తల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది.. అమ్మకు ప్రేమతో ..!

Leopard Mom Viral Video: తల్లి అనే పదం మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది. తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగాలు, ప్రేమ, అంకితభావం వంటివి మరెవ్వరికీ సాధ్యం కావు. తల్లి ప్రేమ అపరిమితమైనది. తన పిల్లల మీద ఆమెకున్న ప్రేమ ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గదు. పిల్లలు చేసే చిన్నచిన్న తప్పులకు కూడా తల్లి సహనంగా ఎదుర్కొంటుంది. వారిని దండించడం కంటే వారిని మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ కోణంలో చూస్తే కేవలం ఇది మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది.  జంతువులు కూడా తమ పిల్లలను మనుషుల మాదిరిగానే ప్రేమగా, అనురాగంతో పెంచుతాయి. అవి కూడా తమ పిల్లలను రక్షించడానికి, వారికి ఆహారం పెట్టడానికి, వారిని పెంచి పెద్ద చేయడానికి ఎంతో కష్టపడతాయి. సింహం పిల్లలను గుంపులోని ఇతర సింహాల నుంచి కాపాడుతాయి. అవి తమ పిల్లలకు వేటాడటం, గర్జించడం వంటి నైపుణ్యాలను నేర్పిస్తాయి. జంతువు పిల్లల ప్రమే, వాటి చిలిపి పనులను ఎల్లప్పుడు మనం సోషల్‌ మీడియాలో చూస్తాము. ముఖ్యంగా కుక్క పిల్లలు తమ తల్లితో ఎలా ప్రవర్తిస్తాయి..? పిల్లి తనకు పుట్టిన పిల్లలను ఎలా ఆడిస్తుంది..? ఈ వీడియోలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట ఒక తల్లి చిరుత చేసిన పని చూసి జనం తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ వీడియోలో ఓ తల్లి చిరుత ఎదురుగా ఉన్న ఒక సింహాన్ని గమనిస్తు ఉంటుంది. తల్లి చిరుత వెనుక చిన్న చిన్న పిల్లలు శబ్దాలు చేస్తూ ఉంటాయి. అయితే ఒకసారిగా సింహం తల్లి చిరుత వైపు దూసుకు రావడంతో చిరుత కూడా అసలు తగ్గకుండా సింహం తో పోరాడుతుంది. తన పిల్లలను రక్షించుకోవడం కోసం సింహంతో సమానంగా పోరాడుతుంది. ఈ వీడియోను ఆండ్రోమెడ (@ChumaSamk91253)  అనే ఎక్స్‌  వ్యక్తి పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వ్యవధిలోనే వీడియో చూసి నెట్టిజన్‌లు షాక్‌ అయ్యారు. తల్లి చిరుత చేసిన తాగం చూసి కామెంట్స్‌ వర్షం కురిపించారు. అమ్మ ఎప్పుడు పిల్లల మంచిని కోరుతుందని దానికి నిదర్శనం ఇదే అని కామెంట్స్‌లో తెలిపారు. 

 

 

 

 

 

 

 

 

 
అమ్మ అంటే కేవలం ఒక పదం కాదు ఒక బంధం. అది మానవులలోనూ, జంతువులలోనూ సమానంగా కనిపించే అద్భుతమైన ప్రేమ. ఆమె మనకు మంచి చెడులను వివరిస్తుంది, జీవితం గురించి అనేక విషయాలు నేర్పుతుంది. ఏ సమస్య వచ్చినా అమ్మే మనకు మొదటి ఆశ్రయం. ఆమె మన కష్టాలను పంచుకుని, మనకు ధైర్యం చెప్పి, మనల్ని ఓదారుస్తుంది. దీనికి నిదర్శనం ఈ వీడియో అని చెప్పవచ్చు.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News