Aggressive King Cobra: కోపంతో ఊగిపోతున్న కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేసిన స్నేక్ క్యాచర్

Snake Catcher Catching King Cobra: అతి భయంకరమైన పాములతో కింగ్ కోబ్రా మొదటిది.. అలాంటి డేంజరస్ పామును థాయిలాండ్‌లో ఓ స్నేక్ క్యాచర్‌ బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేశాడు. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 21, 2023, 04:02 PM IST
  • బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను ఇంత ఈజీగా పట్టొచ్చా
  • వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్ అవుతాయి
  • వీడియోకి 149,256 వ్యూస్
Aggressive King Cobra: కోపంతో ఊగిపోతున్న కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేసిన స్నేక్ క్యాచర్

Snake Catcher caught aggressive king cobra very easily: సాధారణంగా మనం పామును చూస్తేనే వెన్నులో వణుకు పుట్టి అక్కడి నుంచి పారిపోతాం. ఇక కింగ్ కోబ్రాను చూస్తే తడిసిపోతుంది. ఇంకోసారి అటు వైపుకు కూడా వెళ్లం. ఎందుకంటే.. కింగ్ కోబ్రా కాటేస్తే మనిషి బ్రతకడం చాలా చాలా కష్టం. కింగ్ కోబ్రా విషం మనిషి మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. సాధరణ పాము లానే కింగ్ కోబ్రా విషం ఉన్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ మొత్తంలో విషాన్ని చిమ్మిస్తుంది. అందుకే ఈ భూ ప్రపంచంలో కింగ్ కోబ్రాను అత్యంత విషపూరితమైనదిగా పరిగణిస్తారు. 

ఎక్కువగా అడవుల్లో సంచరించే కింగ్ కోబ్రా.. చాలా అరుదుగా జనావాసాల్లోకి వస్తుంటుంది. అలా వచ్చిన కింగ్ కోబ్రాలను స్నేక్ క్యాచర్‌లు మాత్రమే పట్టి మళ్లీ అడవుల్లో వదిలేస్తుంటారు. సాధారణ ప్రజలు కింగ్ కోబ్రాలను పట్టడం అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే అది బుసలు కొడుతూ మీదికి దూసుకొస్తుంది. పడగ విప్పినపుడు కింగ్ కోబ్రా ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ సమయంలో కింగ్ కోబ్రాను చూస్తే.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కొన్నిసార్లు కింగ్ కోబ్రా చాలా నైపుణ్యం ఉన్న స్నేక్ క్యాచర్‌లకు కూడా చుక్కలు చూపిస్తాయి. టెక్నీక్ ఉన్న స్నేక్ క్యాచర్‌ మాత్రం చాలా సునాయాసంగా పడుతుంటాడు. 

తాజాగా థాయిలాండ్‌లో ఓ స్నేక్ క్యాచర్‌ బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేశాడు. ఆయిల్ ఫామ్ తోటలో కింగ్ కోబ్రా ఉండడం గమనించిన యజమాని.. స్నేక్ క్యాచర్‌లకు సమాచారం ఇచ్చాడు. స్నేక్ క్యాచర్‌లు తోటలో గాలించగా.. కింగ్ కోబ్రా కనిపిస్తుంది. ఒకతను పాము తోకను పట్టుకుని బయటికి లాగగా.. అది పడగ విప్పి మీదికి దూసుకొస్తోంది. మరోవైపు ఇంకో అతను ఓ స్టిక్‌కు సంచి కట్టి పెడతాడు. కొంత సమయానికి పాము దాని లోపలి వెళుతుంది. ఎలాంటి కష్టం లేకుండా భారీ కింగ్ కోబ్రాను ఈజీగా బుట్టలో వేశాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News