King Cobra Viral Video: అమ్మో ఈ కోబ్రాని చూడండి.. ఎలా బుసలు కొడుతుందో..

Worlds Deadliest King Cobra: పాము.. ఈ పేరు వినగానే ప్రపంచంలోని చాలా మంది హడలిపోతారు. పొరపాటున పాము తారసపడితే వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకంటారు. ఇక అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తారసపడితే.. ప్రాణ భయంతో వణికిపోతారు. అయితే కొంతమంది కింగ్ కోబ్రాలతో సరదాగా ఆటలాడుకుంటున్నారు. 

Written by - P Sampath Kumar | Last Updated : Sep 16, 2022, 02:38 PM IST
  • ముందుగానే ప్లాన్ వేసి
  • కింగ్ కోబ్రాను ఎలా బురిడీ కొట్టించాడో చూడండి
  • వీడియోకు 21,418,379 వ్యూస్
King Cobra Viral Video: అమ్మో ఈ కోబ్రాని చూడండి.. ఎలా బుసలు కొడుతుందో..

Worlds Deadliest King Cobra: పాము.. ఈ పేరు వినగానే ప్రపంచంలోని చాలా మంది హడలిపోతారు. పొరపాటున పాము తారసపడితే వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకంటారు. ఇక అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తారసపడితే.. ప్రాణ భయంతో వణికిపోతారు. అయితే కొంతమంది కింగ్ కోబ్రాలతో సరదాగా ఆటలాడుకుంటున్నారు. పెంపుడు జంతువుల వలే వాటిని పట్టుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

స్నేక్ క్యాచర్‌ మీర్జా ఎండీ ఆరిఫ్ ప్రపంచంలోని అత్యంత పొడవైన మరో కింగ్ కోబ్రాను ఒడిశాలో పట్టుకునున్నాడు. బాలాసోర్‌కు చెందిన ఔపడ గ్రామంలో ఓ రైతు ఇంటి ఆవరణంలో పట్టుకున్నాడు. సుమారుగా 10-12 అడుగుల ఉన్న కింగ్ కోబ్రా.. ఔపడ గ్రామంలోని ఓ రైతు ఇంటి పరిసరాల్లోకి వచ్చింది. ఆ ఇంటి యజమానులు పామును చూసి హడిలిపోయారు. విషయం కాస్త ఊరంతా పాకడంతో.. కింగ్ కోబ్రాను చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. పామును పట్టేందుకు స్నేక్ క్యాచర్‌ మీర్జా ఎండీ ఆరిఫ్ అక్కడికి వచ్చాడు. 

స్నేక్ క్యాచర్‌ ఆరిఫ్ వచ్చేసరికి కింగ్ కోబ్రా కర్రల మధ్యలో దాక్కుంది. స్టిక్ సాయంతో కర్రలను తొలగించగానే.. అతడికి పాము కనబడుతుంది. స్టిక్‌తో కదిలించగానే పారిపోవడానికి ప్రయాణించగా.. ఆరిఫ్ దాని తోకను పట్టుకుంటాడు. ఆపై పామును రోడ్డుపై తీసుకొస్తాడు. అక్కడ కింగ్ కోబ్రా అతడి మీదికి దూసుకొచ్చినా.. తన టెక్నీక్ సాయంతో తప్పించుకుంటాడు. ఆపై పామును పట్టడానికి ముందుగానే ప్లాన్ చేసి ఉంచిన సంచి వద్దకు తీసుకొస్తాడు. సంచిని చూడగానే రంద్రం అనుకుని కింగ్ కోబ్రా అందులోకి దూరుతోంది. ఆపై ఆరిఫ్ పామును సంచిలో బంధిస్తాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News