King Cobra Viral Video: పాత ఇంట్లో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. బుసలు కొడుతున్నా ఈ వ్యక్తి ఎంత సులువుగా పట్టాడో!

King Cobra Viral Video, Snake Catcher Mirza MD Arif Caught 12 feet Deadliest King Cobra. పాత ఇంట్లో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రాను మీర్జా ఎండీ ఆరిఫ్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్‌ చాలా సులువుగా పట్టుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 16, 2022, 02:40 PM IST
  • పాత ఇంట్లో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రా
  • కింగ్ కోబ్రాను ఎంత సులువుగా పట్టాడో
  • 2-3 సార్లు కాటేయడానికి వచ్చినా బెదరలేదు
King Cobra Viral Video: పాత ఇంట్లో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రా.. బుసలు కొడుతున్నా ఈ వ్యక్తి ఎంత సులువుగా పట్టాడో!

12 feet King Cobra in Old House: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి సింహం, చిరుత, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా సరదాగా ఉంటే.. మరికొన్ని సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం చాలా భయబ్రాంతులకు గురిచేస్తాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాత ఇంట్లో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి చాలా సులువుగా పట్టేశాడు.

మీర్జా ఎండీ ఆరిఫ్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్‌గా ఒడిశాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ పామును అయినా చాలా ఈజీగా పట్టుకుంటాడు. అది కింగ్ కోబ్రా అయినా సరే అస్సలు వెనకాడడు. ఒట్టిచేతులతోనే చాలా సులువుగా పట్టుకుంటాడు. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ పరిసర ప్రాంతంలోని ఓ గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియోను స్నేక్ క్యాచర్‌ ఆరిఫ్ తన సొంత యూట్యూబ్‌ ఛానెల్ (MIRZA MD ARIF)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News