Man Kiss King Cobra Video: ఇదేం ఫాంటసీరా బాబు.. లవర్ కి పెట్టినట్టు కింగ్ కోబ్రాకి ముద్దు పెట్టేసాడు

Snake Hunter Kiss 15 Feet Black King Cobra. ఈ భూప్రపంచంలో పాములను అమితంగా ఇష్టపడే వారు కూడా ఉంటారు. వారికి పాములంటే అస్సలు భయం ఉండదు.

Written by - P Sampath Kumar | Last Updated : Mar 21, 2023, 03:46 PM IST
  • అచ్చు అమ్మాయికి పెట్టినట్టే
  • బ్లాక్ కింగ్ కోబ్రాను ముద్దుపెట్టుకున్న వ్యక్తి
  • మెంటలెక్కించే వీడియో..
Man Kiss King Cobra Video: ఇదేం ఫాంటసీరా బాబు.. లవర్ కి పెట్టినట్టు కింగ్ కోబ్రాకి ముద్దు పెట్టేసాడు

Snake Hunter Kisses Black King Cobra Like his Girl Friend: ఒక్క కాటులో మనిషిని చంపే శక్తి ఉన్న పాములు ఈ భూప్రపంచంలో చాలా ఉన్నాయి. అందుకే పాములంటే చాలా మంది హడలిపోతారు. అత్యంత విషపూరిత పాములలో కింగ్ కోబ్రా ముందువరసలో ఉంటుంది. ఇది కాటేసే సమయంలో ఎక్కువ విషాన్ని చిమ్ముతుంది కాబట్టి..  ప్రతి ఒకరు వీటికి చాలా దూరంగా ఉంటారు. అయితే ఈ భూప్రపంచంలో పాములను అమితంగా ఇష్టపడే వారు కూడా ఉంటారు. వారికి పాములంటే అస్సలు భయం ఉండదు. వాటిని చాలా సులువుగా పట్టేస్తుంటారు. ఇందుకు సంబందించిన వీడియోలు చాలానే నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.

ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను చుడడానికే భయం వేస్తుంది. ఇక అది ఎదురుపడితే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ వ్యక్తి ఏకంగా దానిని ముద్దుపెట్టుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ స్నేక్ హంటర్ రెండు బ్లాక్ కింగ్ కోబ్రాలను సంచిలోంచి బయటకు తీస్తాడు. అవి రెండు కాసేపు పోట్లాడుకుంటాయి. ఓ పాము మరో పామును కాటేస్తుంది. అవి రెండు పారిపోవడానికి ప్రయతించగా.. ఓ పామును పట్టుకుని సంచిలో బంధిస్తాడు. 

బ్లాక్ కింగ్ కోబ్రాతో స్నేక్ హంటర్ ఆడుకుంటాడు. అది కాటేయడానికి దూసుకొచ్చినా వెనక్కి తగ్గకుండా తప్పించుకుంటాడు. చాలా సమయం తర్వాత దాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. ఆపై పడగ విప్పిన కింగ్ కోబ్రా ముందు నెమ్మదిగా తన తలను తీసుకొస్తాడు. ఆపై బ్లాక్ కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకున్నాడు. అనంతరం స్నేక్ హంటర్ తన తలను కింగ్ కోబ్రా తలపై గుద్దుతాడు. చివరకు దాన్ని పట్టుకుని సంచిలో వేస్తాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News