Interesting Facts In Telugu: ఏ దేశం పేరు చెప్పినా.. ముందు గుర్తొచ్చేది ఆ దేశ రాజధాని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు రాజధానులు ఉన్నాయి. చరిత్రను పరిశీలించినా.. ప్రాచీన కాలం నుంచి రాజధానుల సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ప్రపంచంలో రాజధాని లేని దేశం ఇప్పటికీ ఉంది. అవును ఆ దేశం రాజధాని లేకుండానే అన్ని కార్యాకలపాలను నిర్వహిస్తోంది. నౌరు అనే ద్వీప దేశం గురించి చాలా తక్కుమ మందికి తెలుసు.
ప్రపంచవ్యాప్తంగా అనేక ద్వీప దేశాలు ఉన్న విషయం తెలిసిందే. అతిపెద్ద ద్వీప దేశం ఇండోనేషియా కాగా.. అతి చిన్న ద్వీప దేశం నౌరు. అన్ని ద్వీప దేశాలకు రాజధానులు ఉండగా.. నౌరు దేశానికి మాత్రం రాజధాని లేదు. ఇది మైక్రోనేషియన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఈ ద్వీపం కేవలం 21 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది. ఈ దేశం ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర రిపబ్లిక్ దేశం. రాజధాని లేని ఏకైక రిపబ్లికన్ దేశం కూడా నౌరునే కావడం గమనార్హం. ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. దీంతో నౌరు దేశాన్ని 'ఆహ్లాదకరమైన ద్వీపం' అని కూడా పిలుస్తారు. 2018 జనాభా లెక్కల ప్రకారం.. నౌరు దేశంలో కేవలం 11 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశం గురించి ప్రపంచ దేశాలకు పెద్దగా తెలియకపోవడంతో పర్యాటకుల రద్దీ కూడా పెద్దగా ఉండదు. నౌరు దేశంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది. 'నౌరు అంతర్జాతీయ విమానాశ్రయం' అని పేరు పెట్టారు. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని నమ్మే వారు ఉన్నారు. కొందరు ఏ మతాన్ని నమ్మని వారు కూడా నివసిస్తున్నారు.
నౌరు దేశంలో 3 వేల సంవత్సరాల క్రితం మైక్రోనేషియన్లు, పాలినేషియన్లు వచ్చి స్థిరపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ దేశాన్ని 12 తెగలు పాలించారని చెబుతారు. 60-70 దశకంలో ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరు ఫాస్ఫేట్ మైనింగ్‌గా ఉండేది. అయితే దోపిడీ కారణంగా ఆగిపోయింది. ఇక్కడ కొబ్బరి అధికంగా ఉత్పత్తి అవుతుంది. రాజధాని లేకపోయినా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో మెరుగ్గా రాణిస్తోంది.
Also Read: ORR Road Accident: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Also Read: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 11 మంది సభ్యులు ఎన్నిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి