Angry Black King Cobra: బుసలు కొడుతూ కాటేయటానికి వచ్చిన బ్లాక్ కింగ్ కోబ్రా.. చాకచక్యంగా కంట్రోల్ చేసిన స్నేక్ క్యాచర్

Angry King Cobra Video Got Viral: సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అందులో కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలైతే మరికొన్ని వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాడుతున్నాయి. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియోను మీరు చూస్తే తెగ ఆశ్చర్యపోతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 05:49 PM IST
Angry Black King Cobra: బుసలు కొడుతూ కాటేయటానికి వచ్చిన బ్లాక్ కింగ్ కోబ్రా.. చాకచక్యంగా కంట్రోల్ చేసిన స్నేక్ క్యాచర్

Angry King Cobra Viral Video : పాములంటే చాలా దూరం భయంతో పరిగెత్తే వారు ఉంటారు. కానీ స్నేక్ క్యాచర్స్ పాములను రక్షించేందుకు ప్రాణాలు సైతం పణంగా పెట్టి పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతమంది స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకునే క్రమంలో కాటు కూడా గురవుతున్నారు. అయినప్పటికీ పాములు పట్టుకుని వృత్తిని వదలడం లేదు. కొంతమంది పాములు పట్టుకునే వారు పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలను సాహసం చేసి పట్టుకునే క్రమంలో కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఓ స్నేక్ క్యాచర్ ఎంతో సాహసం చేసి రెండు ఇండియన్ కింగ్ కోబ్రాలను పట్టుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది..

ఆ వీడియోలో ఏం జరిగిందంటే..?
మామూలుగా పాములు గడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దూరుతూ ఉంటాయి. అయితే మీరు ఈ వీడియో చూసినట్లయితే.. పశువుల కొట్టంలో మేతగా వేసి గడ్డిలో రెండు పాములు దూరాయి. దీంతో యజమాని ఓ స్నేక్ క్యాచర్ ను సంప్రదిస్తాడు. ఇంతలోనే పాములు పట్టేవాడు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ ప్రదేశంలోని పాములు ఉండే ప్రాంతాన్ని గమనించి వాటిని వెతికే ఎందుకు ప్రయత్నిస్తాడు. ఇదే క్రమంలో ఓ కింగ్ కోబ్రా స్నేక్ క్యాచర్ దృష్టిలో పడుతుంది. దీంతో ఆయన స్నేక్ క్యాచింగ్ స్టిక్ తో పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన పట్టుకుని క్రమంలో  బయటికి వెళ్లిపోయేందుకు పాము వివిధ ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ స్నేక్ క్యాచర్ ఆ పామును వదలడు. అయితే నెమ్మదిగా ఆ పాముని పట్టుకొని సంచిలో వేస్తాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News