Husband gifted 1000 rs to wife for drinking milk know reason funny video: సాధారణంగా చాలా మంది పెళ్లాయ్యాక.. తమ కొత్త జీవితంలో కొన్నిరకాల ఇబ్బందులు ఎదుర్కొంటరు. ఇద్దరు పెరిగిన పరిస్థితులు, కుటుంబ నేపథ్యంలో వేర్వేరుగా ఉంటాయి. దీంతో కొన్నిసార్లు అడ్జెస్ట్ అవ్వడానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు బేధాభి ప్రాయాలు కూడా వస్తుంటారు. కొంత మంది వీటిని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారు. మరికొందరు మాత్రం ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతుంటారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన భార్యభర్తల విషయాన్ని పంచాయతీల వరకు వెళ్తుంటారు.
ఈ క్రమంలో కొంత మంది భార్యభర్తలు మాత్రం ఫన్నీగా ఉంటారు. ప్రతిదానికి గొడవలకు పోరు. ఎంతో జాగ్రత్తగా తమ కాపురం చేసుకుంటారు. ఏవైన సమస్యలు వస్తే మాట్లాడుకని పరిష్కరించుకుంటారు. అంతేకాకుండా.. చాలా ఫన్నీగా ఉంటారు. ఎన్ని టెన్షన్ లు, ఒత్తిడిలుఉన్న కూడా తమ లైఫ్ ను సరదాగా లీడ్ చేస్తుంటారు. భార్యభర్తలకు చెందిన ఫన్నీ వీడియోలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యామా.. అని ఇటీవల ఎక్కువ మంది రీల్స్ రికార్డు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. తాజాగా,ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఒక ఇల్లాలు..తనకు తననొప్పిగా ఉందని సోఫాలో కూర్చుని ఇబ్బందులు పడుతుంది. ఆమె దగ్గరకు భర్త వచ్చి, ఒక గ్లాసులో పాలను తీసుకుని వస్తాడు. ఆమె పాలను చూడగానే చిరాకుగా.. నాకు పాలంటే అస్సలు ఇష్టముండదు. ఎందుకు తీసుకొని వచ్చారంటూ కూడా ఫైర్ అవుతుంది.దీనికి ఆమె భర్త.. కోప్పడకు.. ఈ పాలు తాగని బలవంతం పెడతాడు. పాలు తాగేందుకు వెయ్యిరూపాయలు కూడా ఆమె చేతిలో పెడతాడు.
ఆమె మాత్రం డౌట్ తోనే ఆ పాలను తాగుతుంది. నా మీద ఎందు కంతా ప్రేమ చూపించారు.. ఎప్పటి నుంచి నా ఆరోగ్యం మీద మీకు ఇంత కేర్ వచ్చిందని సెటైర్ లు వేస్తుంది. దీంతో భర్త.. వెంటనే అసలు విషయం బైటపెడతాడు. తాను.. ఇటీవల ఒక పండితుడిని కలశానని, ఆయన తనకు ఉన్న దోషాలు పోవాలంటే.. పాముతో పాలు తాగించాలని చెప్పాడంట.
Read more:Flags On vehicles: వాహానాలపై జాతీయ జెండాలు పెట్టుకుని తిరుగుతున్నారా ?... ఈ చిక్కుల్లో పడ్డట్లే..
అలా తాగిస్తే దోషాలన్ని పోయి.. మంచి రోజులు వస్తాయంట. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురౌతుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం..భార్యను భలే ఆటపట్టించాడంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.