Dangerous King Cobra: నువ్వు తోపురా సామీ! పడగ విప్పిన పాముకు లెక్చర్ ఇచ్చిన స్నేక్ క్యాచర్!

Snake Catcher Taking Class to King Cobra: కిక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ మీకు బాగానే గుర్తుండి ఉంటుంది కదా.. ఒక సీన్‌ని మించి మరో సీన్ ఉండేలా ప్రతీ సన్నివేశంలో ఒక కొత్త ట్విస్ట్ ఉండేలా రవితేజ క్యారెక్టర్ ఊహకు అందని విధంగా ఎంతో డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశాడు ఆ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇదిగో ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ కూడా పాముతో అలాగే ఆడుకుంటున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2023, 11:57 AM IST
Dangerous King Cobra: నువ్వు తోపురా సామీ! పడగ విప్పిన పాముకు లెక్చర్ ఇచ్చిన స్నేక్ క్యాచర్!

Snake Catcher taking Class to King Cobra: మీరు ఎంతో మంది స్నేక్ క్యాచర్స్‌ని చూసి ఉంటారు.. ఎంతో మంది పాములను ఆడించే వాళ్లను చూసి ఉంటారు.. కానీ వీడిలాంటి స్నేక్ క్యాచర్‌ని మాత్రం ఎక్కడా చూసి ఉండకపోవచ్చు.. పొట్ట కూటి కోసం పాములను ఆడించే వాడు ఒక నాదస్వరం ఊదుతూ ఆ పామును ఆడిస్తుంటాడు.. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం ఏ నాధస్వరం చేతిలో లేకుండానే.. ఏ మంత్రదండం చేత పట్టకుండానే పడగ విప్పి బుసలు కొడుతున్న భారీ సైజ్ కింగ్ కోబ్రా పామును కూర్చోబెట్టి ముచ్చట చెప్పాడు. దానికి ముచ్చట చెబుతున్నాడు. మధ్యమధ్యలో నవ్వుతున్నాడు. మొత్తానికి వీడెవడ్రా బాబూ పాములకే పాఠాలు చెబుతున్నాడు అని మీకు అనిపించేలా చేశాడు. బడి పంతులు పాఠం చెబుతుంటే చిన్న పిల్లోడు కదలకుండా పాఠం విన్నంత బుద్ధిగా ఆ పామును ఎటూ కదలకుండా చేసి మరీ దాని ముందే యూట్యూబ్ ఆడియెన్స్‌కి ఏదో వివరిస్తున్నాడు. అలాగని అతడు ఆ పామును కదలకుండా చేతిలో పట్టుకుని బంధించాడు అని కూడా అనుకోవడానికి వీల్లేదు. 

ఎందుకంటే.. అతడు అప్పుడప్పుడు తప్పించి వీడియో నిడివి ఉన్నంతసేపూ ఆ పామును పట్టుకుని లేడు. ఇంకా చెప్పాలంటే ఆ పామును ఫ్రీగానే వదిలేశాడు.. కాకపోతే ఆ పామును ఎటూ కదలకుండా అక్కడే నిలబడేలా తన చేష్టలతో ఆ పాము చేష్టలుడిగిపోయేలా నిలబడి చూస్తూపోయేటట్టు చేశాడు. అతడి కనికట్టు గొప్పతనం ఏంటంటే.. పాము తనపై దాడి చేయాలనుకున్న ప్రతీసారి తన చేతిని పాము పడగ మాదిరిగా పెట్టి ఆ పాముకు మరో పాము ఎదురు నిలబడినట్టుగా భ్రమించేలా చేస్తున్నాడు. అయినప్పటికీ ఆ పాము కోపంతో కాటేసేందుకు ముందుకొస్తే.. దాని బారి నుంచి తెలివిగా తప్పించుకుంటున్నాడు.

Also Read: Dangerous Snake in Car: కారు డిక్కీలో పడగ విప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. చూస్తేనే లాగు తడిసిపోద్ది

అంత పెద్ద పామునే తన శక్తిని మరిచిపోయి నిలబడేలా చేయడం వీడి గొప్పతనం అయితే.. తను అటూఇటు కదులుతూ ఆ పాము చేత కూడా డాన్స్ చేయించడం వీడికి ఉన్న మరో కళ. నమ్మలేకపోతే మీరు కూడా వీడియోను జాగ్రత్తగా గమనించండి.. మధ్యమధ్యలో తను అటు ఇటు కదులడం ద్వారా ఆ పామును కూడా అలాగే డాన్స్ చేయించాడు. పాము చేతే స్టెప్పులేయించాడు అంటే వీడు మామూలోడు కాదురా బాబూ అని అనుకుంటున్నారు కదా.. అయితే, మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్నేక్ క్యాచర్ ఘన కార్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. అది మాటల్లో చెప్పడం, వ్యాఖ్యాల్లో వర్ణించడం కంటే.. మీరే స్వయంగా చూస్తేనే బెటర్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News