Demolitions Viral Video: పెద్ద పెద్ద బిల్డింగ్స్ పేక మేడల్లా కూలిపోయాయి.. ఒకటి కాదు.. రెండు కాదు..

Demolitions Viral Video: కొన్ని సందర్భాల్లో అనుమతి లేని కట్టడాలను కూల్చడమే తప్ప.. ఏ విధంగానూ రెగ్యులరైజ్ చేసే వీలుండదు. ఇంకొన్నిసార్లు అన్నిరకాల అనుమతులు ఉన్నప్పటికీ వాటికి కాలం చెల్లడమో లేక ఆ భవనాల అవసరాలు తీరిపోయిన కారణంగానో కూల్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 05:41 PM IST
Demolitions Viral Video: పెద్ద పెద్ద బిల్డింగ్స్ పేక మేడల్లా కూలిపోయాయి.. ఒకటి కాదు.. రెండు కాదు..

Demolitions Viral Video: ఇలాంటి అరుదైన వీడియోను మీరు ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరేమో.. ఒకవేళ చూసినప్పటికీ.. అది ఈ స్థాయిలో ఉండే అవకాశమే లేదు అంటున్నారు నెటిజెన్స్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ పేకమేడల్లా కూలిపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా ? అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో భవనాలు క్షణాల వ్యవధిలో నేలమట్టం అవుతుండటం ఇంతకు ముందెప్పుడైనా చూశారా ? భవనాలు మాత్రమే కాదు.. మబ్బుల్ని దాటుకుని ఆకాశంలోకి తొంగి చూస్తున్నట్టుగా ఉన్న ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ కూడా అమాంతం నేలకొరిగితే చూడ్డానికి ఆ దృశ్యం ఇంకెలా ఉంటుంది ? కొన్ని ఎత్తైన, భారీ నిర్మాణాలు అమాంతం పక్కకు కూలుతుంటే.. అర కిలోమీటర్ దూరంలో పడుతుందా అన్నట్టుగా ఉన్నాయి ఈ దృశ్యాలు.

ఏ దేశంలోనైనా ఎత్తైన భవనాలు నిర్మించే విషయంలో ఎన్నో కఠిన నిబంధనలు అమలులో ఉంటాయి. ఆ నిబంధనలు తుంగలో తొక్కి ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తే ప్రభుత్వాలు, సంబంధిత అధికార యంత్రాంగాలు చూస్తూ ఊరుకోవు కదా.. కొన్ని సందర్భాల్లో అనుమతి లేని కట్టడాలను కూల్చడమే తప్ప.. ఏ విధంగానూ రెగ్యులరైజ్ చేసే వీలుండదు. ఇదంతా అనుమతి లేని అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయం కాగా.. ఇంకొన్నిసార్లు అన్నిరకాల అనుమతులు ఉన్నప్పటికీ వాటికి కాలం చెల్లడమో లేక ఆ భవనాల అవసరాలు తీరిపోయిన కారణంగానో కూల్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 

కొన్నిసార్లు ఇలా మాటల్లో ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చునేమో కానీ.. ఇదిగో ఎత్తైన భవనాల కూల్చివేతకు సంబంధించిన అనేక దృశ్యాలను ఒక్క చోట చేర్చి ఒక మాంటేజ్ తయారు చేసిన ఓ నెటిజెన్.. ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అదేంటో మీరే స్వయంగా చూసేయండి.  

 

అలా కారణాలు ఏవైనా.. ఎత్తైన ఆకాశహర్మ్యాలు నేలకూలుతుంటే ఆ దృశ్యం మదిలో ఎన్నోరకాల అనుభూతులను మిగుల్చుతుంది. అలాంటి దృశ్యాలు చూసేవారికి సరదాగానే ఉంటుంది కానీ.. ఆ కట్టడాల యజమానులకు మాత్రం అది భరించలేని బాధను మిగుల్చుతుంది. అంతేకాదు.. ఆర్థికంగానూ ఊహించని రీతిలో భారీ నష్టాన్ని మిగుల్చుతుంది. అయితే, ఆ బిల్డింగ్స్ వల్ల ఇరుగుపొరుగు వారికి హానీ ఉన్నట్టయితే.. వాటిని కూల్చడం వల్ల కలిగే నష్టం కంటే.. అక్కడి వారి సేఫ్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది.

Trending News