IT Refund Status: ఇన్‌కంటాక్స్ రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి

IT Refund Status: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా..అయితే మీకు శుభవార్తే. ఇన్‌కంటాక్స్ శాఖ మీ రిఫండ్ చెల్లింపు ప్రారంభించేసింది. ఆన్‌లైన్‌లో మీ రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2021, 05:34 PM IST
  • ఇన్‌కంటాక్స్ రిఫండ్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభం
  • మీ ఐటీ రిఫండ్ రాకపోతే ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి
  • ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌లో బ్యాంకు వివరాలు చెక్ చేసుకోవడం తప్పనిసరి
IT Refund Status: ఇన్‌కంటాక్స్ రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి

IT Refund Status: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా..అయితే మీకు శుభవార్తే. ఇన్‌కంటాక్స్ శాఖ మీ రిఫండ్ చెల్లింపు ప్రారంభించేసింది. ఆన్‌లైన్‌లో మీ రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం. 

పన్ను చెల్లింపుదారులకు రిఫండ్(Income tax Refund) తిరిగి చెల్లిస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటించింది. ఏప్రిల్ 1 2021-ఆగస్టు 30, 2021 మధ్య 23.99 లక్షలమందికి 67 వేల 401 కోట్ల విలువైన రిఫండ్ వెనక్కి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 8న ఐటీఆర్ దాఖలు చేసిన 22 లక్షల 61 వేల 918 మందికి ఆదాయపు పన్ను రిఫండ్ చేసినట్టు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఎదురైన పలు ఇబ్బందుల మధ్య ఐటీఆర్ దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో తలెత్తిన సమస్యల కారణంగా చాలామంది ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేదు. ఐటీఆర్ రిఫండ్ చేసిన పదిరోజుల్లోగా చెల్లింపు జరుగుతుంది. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యం కూడా కావచ్చు. మీ రిఫండ్ ఇంకా రాకపోతే ఐటీఆర్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ముందుగా మీరు ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో(E Filling Portal) లాగిన్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత మై అక్కౌంట్ ట్యాబ్‌కు వెళ్లి..ఐటీ రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌పై క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్‌తో(IT Refund Status) పాటు రిటర్న్ వివరాలు పేజీపై కన్పిస్తాయి. పన్ను చెల్లింపుదారు రిఫండ్ డబ్బును నేరుగా వారి ఖాతాకే క్రెడిట్ చేస్తారు. లేదా చెక్ ద్వారా గానీ డీడీ రూపంలో గానీ ఇంటి చిరునామాకు పంపిస్తారు. అయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకుకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవల్సి ఉంటుంది. లేదంటే మీ రిఫండ్ ఆగిపోతుంది. 

Also read: Whatsapp Account: కఠిన చర్యలకు దిగిన వాట్సప్, 3 మిలియన్ల ఖాతాలు నిషేధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News