5G Network Activation: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్ యాక్టివేట్ చేసుకోండిలా

How to Activate 5G On Your Phone: దేశంలో 5G నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు చాలా మంది దృష్టి 5G సేవలపై పడింది. ముఖ్యంగా తమ ఫోన్ లో 5G నెట్‌వర్క్ సేవలు ఉపయోగించుకోవచ్చా ? ఒకవేళ ఉపయోగించుకోవస్తే అదెలా సాధ్యం అని గూగుల్ చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

Written by - Pavan | Last Updated : Oct 6, 2022, 10:51 PM IST
5G Network Activation: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్ యాక్టివేట్ చేసుకోండిలా

Steps to activate 5G Network: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశంలో 5G సేవలు లాంచ్ అయినప్పటి నుంచే ఇండియాలో సేవలు అందిస్తున్న టెలికాం ఆపరేటర్స్ 5G సేవలు అందించేందుకు పోటీపడుతున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ ఓ అడుగు ముందుకేసి దేశంలో మొత్తం 8 నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్యా రాజధాని ముంబైతో పాటు వారణాసి, నాగపూర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, సిలిగురి వంటి నగరాలు 5G రేడీ అయ్యాయి. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 5G నెట్ వర్క్ అందించనున్నట్టు ఎయిర్ టెల్ స్పష్టంచేసింది.

ఈ 8 నగరాల్లో మీరు కూడా ఉన్నారా ? మీ చేతిలో కూడా 5G స్మార్ట్ ఫోన్ ఉందా ? అయితే, 5G సేవలు లాంచ్ అవుతుండటంతో 5G సేవలను ఎలా యాక్టివేట్ చేసుకోవాలా అని అన్వేషిస్తున్న వాళ్లలో మీరు కూడా ఒకరన్నమాట. అలాంటి వారి కోసమే ఈ డీటేల్స్. కాకపోతే.. 5G నెట్ వర్క్ ఎనేబుల్ చేయాలంటే ముందుగా మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ 5G స్మార్ట్ ఫోన్ అయ్యుండాలనే విషయం మర్చిపోవద్దు. 

5G సేవల కోసం కొత్త సిమ్ కార్డు తీసుకోవాలా ?
ఇప్పుడు చాలా మందిలో కలుగుతున్న సందేహం ఏంటంటే.. 5G సేవలు పొందాలంటే గతంలో 4G సిమ్ కార్డు అప్ డేట్ చేసుకున్నట్టుగానే కొత్తగా 5G సిమ్ కార్డు కూడా తీసుకోవాలా అని చాలా మందికి ఒక సందేహం కలుగుతోంది. అలాంటి వాళ్లందరికీ నో అనే సమాధానమే చెప్పాలి. అవును.. కొత్త సిమ్ కార్డు అవసరం లేకుండానే పాత సిమ్ కార్డులోనే 5G సేవలు యాక్టివేట్ చేసుకోవచ్చు. 

5G నెట్ వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

Step 1: మీ ఫోన్‌లో సెట్టింగ్స్ మెనూకి వెళ్లండి.

Step 2: కనెక్షన్స్ లేదా మొబైల్ నెట్‌వర్క్ ఆప్షన్ ఎంచుకోండి.

Step 3: నెట్‌వర్క్ మోడ్‌లో 5G/4G/3G/2G ఆప్షన్స్‌లోకి వెళ్లి 5G ఆప్షన్ ఎంచుకోండి.

Step 4: మీ ఫోన్ హోమ్ స్క్రీన్‌కి వెళ్లి కుడివైపు టాప్ కార్నర్‌లో 5G నెట్‌వర్క్ చెక్ చేసి చూడండి. 

5G స్మార్ట్ ఫోన్‌లో 4G సిమ్ కార్డు ఉపయోగించి 5G సేవలు పొందవచ్చు కానీ 5జి కాని ఫోన్‌లో 5జి సేవలు (5G Network Services) పొందడం సాధ్యం కాదనే విషయం గ్రహించాల్సి ఉంటుంది.

Also Read : Infinix Zero Ultra 5G: ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ కెమేరా చూస్తే మతి పోవల్సిందే, 200 మెగాపిక్సెల్ కెమేరా అంటే మాటలా మరి

Also Read : Whatsapp Data Transfer: మీ ఐవోఎస్ ఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు డేటా ఎలా బదిలీ చేయాలో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News