Davidson Bike Milk Viral Video: ఇది నేనేడా సూడలే.. పాల డెలివరీకి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌! వైరల్ వీడియో

Viral Video, Milk Man delivers Milk on his Costly Harley-Davidson Bike. తాజాగా ఓ వ్యక్తి పాలు అమ్మేందుకు ఏకంగా బైక్‌ హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌ను వాడుతున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 7, 2023, 08:37 AM IST
  • ఇది నేనేడా సూడలే
  • పాల డెలివరీకి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌
  • వైరల్ వీడియో
Davidson Bike Milk Viral Video: ఇది నేనేడా సూడలే.. పాల డెలివరీకి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌! వైరల్ వీడియో

Man selling Milk On Harley Davidson Bike worth 11 lakhs above: కొన్నాళ్ల క్రితం పాల వ్యాపారాలు ఎక్కువగా సైకిల్స్ ఆడేవారు. సైకిల్‌పై తిరుగుతూ ఇంటింటికి వెళ్లి పాలు పోసేవారు. కాలం మారుతున్నా కొద్దీ.. సైకిల్‌ వినియోగం పోయి బైక్స్ వచ్చాయి. ఇటీవల ఎక్కువగా టీవీఎస్ చాంప్స్, స్కూటీలను పాల వ్యాపారాలు వాడుతున్నారు. కొందరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. హీరో హోండా, బజాజ్, టీవీఎస్ బైక్స్ వాడుతున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి పాలు అమ్మేందుకు ఏకంగా బైక్‌ హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌ను వాడుతున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ ప్లేట్ నంబర్ లేని హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌ను పాల వ్యాపారం కోసం వాడుతున్నాడు. నంబర్‌కు బదులుగా 'గుజ్జర్' అనే పేరు రాసి ఉంది. వ్యక్తి ఎక్కడ పాలు అమ్ముతున్నాడో, ఏ ప్రాంతానికి చెందిన వాడో వివరాలు తెలియరాలేదు. ఏదేమైనా ఆ వ్యక్తి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌కు ఇరు వైపులా రెండు పెద్ద పాల క్యాన్లు తగిలించుకున్నాడు. అంతేకాదు ఖరీదైన హెల్మెట్ కూడా మనం వీడియోలో చూడవచ్చు. హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌పై ఆ వ్యక్తి వీధుల్లో తిరుగుతూ ఎంచక్కా ఇంటింటికీ పాలు పోస్తున్నాడు. 



View this post on Instagram


A post shared by Amit Bhadana (@amit_bhadana_3000)

ఇందుకు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను అమిత్‌ బదనా (amit_bhadana_3000) అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇటీవలే పోస్ట్ చేసిన ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌ రూ. 11 లక్షలకు పైనే ఉంటుందట. 'ఇదేందయ్యో ఇది.. ఇది నేనేడా సూడలే' అని ఒకరు కామెంట్ చేయగా.. 'వీడెవడ్రా బాబు.. వచ్చే పాల డబ్బులతో పెట్రోల్ కొంటాడు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఇక సరైన నంబర్ ప్లేట్ లేని అతన్ని బహిరంగ వీధుల్లోకి ఎలా అనుమతించారని చాలామంది ప్రశ్నించారు.

Also Read: Saturn Transit 2023: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని.. ఈ 3 రాశుల వారికి ఇక డబిడదిబిడే!   

Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. వసతి గదుల అద్దె భారీగా పెంపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News