Viral Video: బంతితో ఆడుకుంటున్న గుర్రం... నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Viral Video Today: నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 03:41 PM IST
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గుర్రం వీడియో
  • యజమానితో సరదాగా ఆడుకుంటున్న హార్స్
Viral Video: బంతితో ఆడుకుంటున్న గుర్రం... నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Viral Video Today: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, ఏనుగు పిల్లలు ఆడుకోవడం చూస్తే మనకు ముచ్చటేస్తుంది. ఈ వీడియోలు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. గుర్రం బంతితో ఆడుకుంటున్న వీడియో (Horse Video viral) ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మనం జంతువులు, పక్షులతో ఎక్కువగా ఉంటే...మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 

ఈ వీడియో ఓపెన్ చేస్తే... ఇందులో యజమాని బంతిని విసురుతుంటే..గుర్రం పరిగెత్తుకు వచ్చి బంతిని తన్నుతుంది. ఓనర్, గుర్రం ముచ్చటగా ఆడుకుంటున్న దృశ్యాలు మనకు కనువిందు చేస్తాయి. ఈ వీడియో Buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. దీనికి “గుర్రం బంతితో ఆడుతోంది..” అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ''అన్ని గుర్రాలకు ఇలా ఆడుకునే అవకాశం ఇవ్వాలి. ఆ అదృష్ట గుర్రాన్ని చూడటం ఎంత సంతోషంగా ఉందో అలాంటి ఆలోచనాపరుడైన యజమానిని కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అంటూ ఓ నెటిజన్ రాసుకోచ్చాడు. ఈ వీడియో కంటే 9 వేల కంటే ఎక్కువ రీట్వీట్లు వచ్చాయి. 1.8 మిలియన్ల మంది వీక్షించారు. 

Also Read: Viral Video: వధువును టచ్ చేసినందుకు.. స్టేజీ పైనే ఫోటోగ్రాఫర్‌ను చాచిపెట్టి కొట్టిన వరుడు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News