Elephant Video Viral: పానీపూరీలు అమాంతం లాగించేసిన ఏనుగు... షాక్ లో నెటిజన్లు..

Elephant Video Viral: సోషల్ మీడియాలో ఈ మధ్య చిత్ర విచిత్ర వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఏనుగు పానీపూరి తిన్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 12:32 PM IST
Elephant Video Viral: పానీపూరీలు అమాంతం లాగించేసిన ఏనుగు... షాక్ లో నెటిజన్లు..

Elephant Video Viral: ప్రస్తుత రోజుల్లో మనుషులతో పాటు జంతువుల అభిరుచులు కూడా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య కోతి ఐస్ క్రీం తిన్న వీడియో, కుక్క డ్రింక్ తాగిన వీడియో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఏనుగు పానీపూరి తిన్న (Elephant eats Panipuri) వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.  మీరు ఓ లుక్కేయండి మరి.

వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ మావటివాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకొస్తాడు. ఆ బండి యజమాని పానీపూరీలను ఒకటి ఒకటి ఇస్తూ ఉంటే ఆ ఏనుగు చాలా చక్కగా తింటుంది. ఏనుగు పానీపూరి తినడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అసోంలోని తేజ్​పుర్​లో చోటుచేసుకుంది. తాజాగా ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

ఏనుగు చెరుకును తినడం చుశాం కానీ ఇలా పానీపూరి తినడం ఏంటి భయ్యా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఎంతో బుద్దిగా పానీపూరీలు లాగించేస్తున్న ఈ ఏనుగు వీడియోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. అంతేకాదు ఎక్కువ మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.  

Also read: Rhino Hit Truck: ట్రక్కును ఢీకొట్టిన ఖడ్గమృగం.. సహించేది లేదంటున్న అస్సాం సీఎం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News