Shocking video: మెుసలిపై జాగ్వార్ దాడి చూస్తే.. మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది!

Black Jaguar VS Crocodile: జాగ్వార్, మెుసలికి సంబంధించిన ఫైట్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 01:44 PM IST
Shocking video: మెుసలిపై జాగ్వార్ దాడి చూస్తే.. మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది!

Black Jaguar Attacks Crocodile: సోషల్ మీడియాలో ఈ మధ్య యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అమెరికాలో అతిపెద్ద పిల్లి జాతి జాగ్వర్. సాధారణంగా దీనిని చిరుతపులితో పోలిస్తారు. 'జాగ్వార్' అనే పదం 'యాగ్వార్' అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం 'ఒక దూకుతో చంపేవాడు'. జాగ్వర్ మొసలిని వేటాడుతున్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది.ఈ వీడియోను 'wildlifeanimall' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అప్ లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోను 38వేల మంది వీక్షించగా.. 1600 లైక్ లు వచ్చాయి.  మీరు ఈ వీడియో పై ఓ లుక్కేయండి. 

వీడియో ఓపెన్ చేస్తే... ఓ నదిలో కొంత మంది బోటింగ్ చేస్తూ ఉంటారు. నది ఒడ్డున మెుసలి సేద తీరుతూ ఉంటుంది. ఇంతలో సడన్ గా పొదల్లోంచి మెుసలిపైకి ఓ దూకు దూకుతుంది బ్లాక్ జాగ్వర్. తన ప్రాణాలను కాపాడుకునేందుకు నీటిలోకి దిగుతుంది మెుసలి. నీటిలో ఈ రెండింటికీ పైట్ జరుగుతుంది. చివరికు జాగ్వర్ పైచేయి సాధిస్తుంది. మెుసలిని నోటి కరుచుకుని పొదల్లోకి తీసుకెళ్తుంది జాగ్వర్. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని పాంటనాల్ ప్రాంతంలో జరిగింది. నదిలో బోటింగ్ చేస్తున్న అక్కడి వారు ఈ వీడియోను చిత్రీకరించారు. జాగ్వార్ వేట చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

Also Read: Crocodile Boy Viral Video: సినిమా కాదు.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ సీన్! మొసళ్ల మధ్యలో బాలుడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News