Viral: అక్కడ స్మార్ట్ ఫోన్ కొంటే.. 2 కిలోలు టమాటాలు ఫ్రీ..!

Unique Scheme: కస్టమర్లను ఆకట్టుకునేందుకు మొబైల్ షోరూమ్‌లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.  తాజాగా ఓ సెల్ ఫోన్ షాపు యజమాని ఇచ్చిన ఆఫర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2023, 12:52 PM IST
Viral: అక్కడ స్మార్ట్ ఫోన్ కొంటే.. 2 కిలోలు టమాటాలు ఫ్రీ..!

Ashoknagar Businessmen Unique Scheme: దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నింటుతున్నాయి. ముఖ్యంగా టమాటాల ధర చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ. 100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో రూ. 120 వరకు అమ్ముతున్నారు. పెరిగిన టమాటా ధరలను తనకు అనుకూలంగా మలుచుకున్నాడో వ్యక్తి. తన మెుబైల్ షాపులో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు. దీంతో ఆ సెల్ ఫోన్ షాపుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఈ వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ పట్టణంలో టమాటా కిలో ధర రూ. 160 వరకు పలుకుతోంది. ఇదే పట్టణానికి చెందిన అశోక్ అగర్వాల్ అనే వ్యక్తికి ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఇతడి మెుబైల్ షాపు ఉండటంతో.. స్మార్ ఫోన్ కొన్న వారికి టమాటాలు ఉచితంగా ఇస్తే తన వ్యాపారం పెరుగుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా తన దుకాణంలో స్మార్ ఫోన్ కొన్నవారికి రెండు కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. దీనిపై ప్రచారం కూడా చేయించాడు. ఇది తెలుసుకున్న జనాలు అతడి షాపుకు రావడం మెుదలుపెట్టారు. ఈ ఆఫర్ పెట్టడం వల్ల తన షాపుకు కస్టమర్ల సంఖ్య పెరిగిందని.. ఫోన్లు బాగా అమ్ముడుపోతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. తన కస్టమర్లకు 50 కిలోల కంటే ఎక్కువ టమోటాలు ఇప్పటి వరకు అందించినట్లు అతడు తెలిపాడు.

Also Read: Manager Caught Watching Lust Stories 2: ఆన్‌లైన్ మీటింగ్‌లో లస్ట్ స్టోరీస్ 2 చూస్తూ అడ్డంగా దొరికిపోయిన మేనేజర్

Also Read: Viral Video: ఇంట్లో చెప్పే వచ్చావా..? రైలు పట్టాల కింద ఎలా పడుకున్నాడో చూడండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News