CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..

CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది. ఈ ఘటనలో ఒక యువతి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 14, 2024, 03:10 PM IST
  • సీఎం జగన్ పై దాడి పట్ల ఆందోళనలో అభిమానులు..
  • వైరల్ గా మారిన యువతి ఆవేదన..
CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..

Girl Cried Over Stone Attack On AP CM YS Jagan Video Viral: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ విజయవాడలో బస్సుయాత్రలో అనుకోని షాకింగ్‌ ఘటన జరిగింది. సింగ్ నగర్ లో ప్రాంతంలో.. ఆకతాయిలు రాత్రిపూట ప్రచారం నిర్వహిస్తుంగా  రాళ్లతో దాడికి దిగారు. దీంతో బాధతో ఆయన విలవిల్లాడిపోయారు.  వెంటనే బస్సుపై నుంచి దిగి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. రాయి నేరుగా ఆయనకు ఎడమ కండి పైభాగంలో తగిలింది. ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స చేసి మూడు కుట్లు వేశారు. అదే విధంగా ఆయన పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా రాయి తగిలింది. దీంతో ఆయనకు కూడా వైద్యులు చికిత్స చేశారు. ప్రథమచికిత్స తర్వాత కూడా సీఎం జగన్ రెండు గంటల పాటు బస్సు యాత్రను కొనసాగించారు.

 

ఇదిలా ఉండగా.. సీఎంగ జగన్ పై రాళ్లదాగి ఘటన ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ మారింది. ఇది రాళ్లదాడి కాదని, సీఎం జగన్ ను అంతమోందిచేందుకు కుట్ర జరిగిందనికూడా ఏపీ రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాల లేకపోవడం, దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో టీడీపీ ఆఫీస్ ఉందన్నారు. దాడికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు బాధ్యత వహించాలని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇది ముమ్మటికి చంద్రబాబు కుట్ర అని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను భరించలేకే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇక దాడి ఘటనను.. సీఎం చెల్లెలు, వైఎస్ షర్మిలా, పీఎం మోదీ, సీఎం స్టాలీన్, మమతా బెనర్జీ, కేటీఆర్ వంటి పలువురు నేతలు ఖండించారు. దీనిపై ఎన్నిలక కమిషన్ కూడా  సీరియస్ అయ్యింది. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా విజయవాడ ఎస్పీని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. జగన్ పై దాడి జరగిన విషయం తెలవగానే ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆందోళనలకు గురయ్యారు. ఈరోజు విజయవాడకు ఆయనను చూడటానికి పొటెత్తారు.

Read More: Smita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో..

ఒక యువతి సీఎం జగన్ పై దాడి జరిగిందని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. జగన్ మామయ్య పై ఈ దాడులేంటని గుక్కపెట్టి మరీ ఏడ్చింది. మంచి పనులు చేస్తే ఇలా చేస్తారా.. అమ్మా అంటూ బాధ పడింది. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం జగన్ తొందరగా కోలుకోవాలంటూ కూడా ఆయన అభిమానులు, కులమతాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తూ, మొక్కులు తీర్చుకుంటున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News