Funny Stunt Video: హీరో లెవల్ ఎంట్రీ.. లవర్‌కి ముద్దు పెట్టబోయి, ఢమాల్!!

సోషల్ మీడియాలో ఫేమస్ అవటానికి  వింతైన స్టంట్స్ చేస్తుంటారు. వీటిలో కొన్ని సక్సెస్ అయితే.. మరి కొన్ని విఫలమై నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వివరాలు..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 03:46 PM IST
Funny Stunt Video: హీరో లెవల్ ఎంట్రీ.. లవర్‌కి ముద్దు పెట్టబోయి, ఢమాల్!!

Funny Stunt Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతుంది. ఫన్నీ, ట్రాజడీతో పాటు అనేక రకాలైన వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే ఈ మధ్య చాలా మంది ఫేమస్ అయ్యేందుకు ఏదో ఒక పని చేసి పాపులర్ అవ్వాలని చూస్తుంటారు. అలా పాపులర్ అవ్వాలని చేసే పనులు కొందరు నవ్వులపాలు అవుతుంటారు. నెట్టింట పాపులర్ అయ్యేందుకు కొందరు తమ ప్రాణాలకు కూడా లెక్కచేయడం లేదు. సినిమాల్లో లాగా స్టంట్ వీడియోలు చేస్తూ.. వైరల్ అవుతున్నారు. 

సినిమాల్లో లాగా నిజజీవితంలోనూ తమ గర్ల్ ఫ్రెండ్స్ ను హీరోయిన్లుగా ఫీల్ అవుతూ.. వాళ్లని ఆకట్టుకునేందుకు రీల్స్ చేస్తున్నారు ఈతరం కుర్రకారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ కుర్రాడు బైక్ పై ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం కనిపిస్తోంది. కానీ, అది బెడిసికొట్టింది. అమ్మాయి ఇంప్రెస్ అవ్వడం ఏమో తెలియదు కానీ, ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల తన ప్రియురాలు ఆస్పత్రి పాలైంది. 

Also Read: IND Vs SL Asia Cup Super 4 Match Updates: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో మార్పులు.. ఆ ప్లేయర్ ఎంట్రీ..!  

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Iᴅᴇᴀ Cʀᴇᴀᴛᴏʀ (@tn_idea_creator_official)

ఏం జరిగిదంటే?
ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో ప్రకారం.. ఓ అమ్మాయి హెల్మెట్ ధరించి ఎవరు లేని, నిర్మానుష రహదారిపై నిల్చొని ఉన్నట్లు తెలుస్తోంది. అంతలో ఓ యువకుడు బైక్ పై వచ్చి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నించాడు. కానీ, అంతలోనే ఆ ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆ అమ్మాయిని ఢీ కొంది. 

ఈ క్రమంలో అమ్మాయి కింద పడిపోయింది. అయితే ఏదో పెద్ద స్టంట్ చేద్దాం అనుకుంటే అందరి ముందు నవ్వులు పాలయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ, ఆ వీడియో మాత్రం నవ్వులను పూయిస్తోంది.

Also Read: Chandrababu Case: బావ కడిగిన ముత్యంలా బయటికొస్తారు, అంతా కక్ష సాధింపే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

 

Trending News