Wife Listed Her Husband for Sale: అచ్చు ఐపీఎల్ మాదిరే.. భర్తను వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టిన భార్య! నో రిటర్న్, నో ఎక్స్చేంజ్‌!

తాజాగా న్యూజీలాండ్‌లో లిండా మెక్‌అలిస్టర్ అనే మహిళ తన భర్త జాన్‌ను ట్రేడ్‌మీ వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టింది. జాన్‌పై ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 10:40 AM IST
  • అచ్చు ఐపీఎల్ మాదిరే
  • భర్తను వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టిన భార్య
  • నో రిటర్న్, నో ఎక్స్చేంజ్‌
Wife Listed Her Husband for Sale: అచ్చు ఐపీఎల్ మాదిరే.. భర్తను వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టిన భార్య! నో రిటర్న్, నో ఎక్స్చేంజ్‌!

Wife Listed Her Husband for Sale on Auction Site: ఈ సృష్టిలో భార్యభర్తల బంధం చాలా గొప్పది. కేవలం తాళి కట్టాడనే కారణంతో స్త్రీ తన వాళ్లందరినీ వదిలేసి, ఇంటిపేరు మార్చుకొని భర్త వెనక వచ్చేస్తుంది. భార్యభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. దాంతో కొందరు విడిపోతే.. మరికొందరు సర్దుకుని పోతారు. ఇంకొందరు మాత్రం చిన్న చిన్న కారణాలకే నిరాశకు గురవుతుంటారు. అలాంటి ఘటనే తాజాగా న్యూజీలాండ్‌లో చోటుచేసుకుంది. నిరాశకు గురైన భార్య తన భర్తను వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టింది. 

లిండా మెక్‌అలిస్టర్, జాన్ రోమింగ్ భార్యభర్తలు.  ఈ జంట 2019లో ఐర్లాండ్‌లో వివాహం చేసుకుని.. న్యూజీలాండ్‌లో ఉంటున్నారు. వీరికి 4 ఏళ్ల కోల్ట్ మరియు 6 ఏళ్ల రైడర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జాన్‌కు చేపల వేట అంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా.. అతడు ఫిష్ హంటింగ్‌కు వెళతాడు. వెళ్లిన ప్రతిసారి తన భార్య, పిల్లలను వదిలేసి వెళతాడు. ఇది లిండాకు నచ్చదు. ఈ విషయంపై జాన్‌తో ఎన్నిసార్లు మాట్లాడినా అతడిలో మార్పు రాలేదు. తాము కూడా చేపల వేటకు వస్తామని చెప్పినా.. వద్దని వారించేవాడు. 

తాజాగా లిండాకు చెప్పకుండా జాన్ చేపల వేట వెళ్లాడు. దాంతో నిరాశ చెందిన లిండా.. న్యూజీలాండ్‌లో పాపులర్ అయిన ట్రేడ్‌మీ వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టింది. జాన్‌పై ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసింది. 'నా భర్తను అమ్మకానికి పెడుతున్నా. అతడి పేరు జాన్. వయస్సు 37 సంవత్సరాలు. 6 అడుగుల 1 ఎత్తు ఉంటాడు. వృత్తి రీత్యా రైతు. బాగా చూసుకుంటాడు. చేపల వేట అంటే చాలా ఇష్టం. నా భర్తకు గృహ శిక్షణ అవసరం. ప్రస్తుతానికి నాకు సమయం లేదు' అని లిండా పేర్కొంది. 

లిండా ఇచ్చిన ప్రకటనకు ట్రేడ్‌మీ సైట్ 'నో రిటర్న్, నో ఎక్స్చేంజ్‌' అని కాప్షన్ ఇచ్చింది. జాన్ స్నేహితులు వేలం గురించి చెప్పే వరకు తన భార్య లిండా అమ్మకానికి పెట్టిందని అతడికి తెలియదు. ఆపై ఈ వేలంపై ఫిర్యాదు రావడంతో.. చివరికి ట్రేడ్‌మీ సైట్ ప్రకటనను తీసేసింది. ట్రేడ్‌మీ పాలసీ మరియు కంప్లైయెన్స్ మేనేజర్ జేమ్స్ ర్యాన్ మాట్లాడుతూ.. ప్రకటనను తీసేసామని, కివీస్ ప్రజలను ఆనందంగా చూడడమే తమ లక్ష్యం అని చెప్పారు. 

Also Read: Yash Dhull Six: పిచ్‌పై డాన్స్ చేస్తూ సిక్స్ కొట్టిన టీమిండియా ప్లేయర్ (వీడియో)!!

Also Read: Attack on Asaduddin Owaisi: అప్పుడు అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులు.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసి కారుపై కాల్పులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News