నీటిలో మొసలి బలం ఎక్కువ. అదే తీరానికి వస్తే తక్కువగా ఉంటుంది. నేలపై సంహాన్ని మించిన వేటగాడు లేడు. కానీ నీటిలో మాత్రం సింహం బలం తక్కువే. దీన్నే స్థానం బలం అంటారు. స్థానబలం తెలిసి బతకాలి అంటారు. తనది కాని చోట అధికులం అనరాదు.. కొండ అద్దమందు చిన్నదై ఉండదా అని చదివే ఉంటారు.
కానీ ఈ విషయం ఈ సింహానికి తెలియదు అనుకుంటా.. అందుకే మొసలి ఏరియాలోకి ఎంటరైంది.
కింగ్ ఆఫ్ ది జంగిల్ కదా.. నన్నెవరు ఆపుతారు అని హాయిగా స్విమ్మింగ్ చేయడం ప్రారంభించింది. కానీ అప్పుడే చిన్న ట్విస్ట్ వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ ( Viral Video ) అవుతోంది.
అడవికి రారాజు సింహం వస్తే మాత్రం.. నీటిలో కింగ్ అయిన మొసలి ఊరుకుంటుందా.. వెంటనే సింహాన్నినోటితో నమిలేద్దాం అనుకున్నట్టు ముందుకు దూకింది. ఈ విషయం తెలియక సింహం మాత్రం అలాగతే స్విమ్మింగ్ చేస్తూ కొనసాగిస్తోంది. అంతలోనే మొసలి వెన్నుపోటు పొడిస్తే కెవ్వు మంటూ బతకుజీవుడా అనుకుంటూ తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి సేఫ్ అయింది. జీవితానికి సరిపడా పాఠం నేర్చుకుని సైలైంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను నెటిజెన్స్ ( Netizens ) బాగా ఇష్టపడుతున్నారు.
It’s not always a good idea to enter in somebody else’s territory even though you are king of Jungle. A narrow escape- Unravelling mysteries of #Nature 😀
pic.twitter.com/CobfhCUNAc— Dr Abdul Qayum, IFS (@drqayumiitk) September 1, 2020