Elephant try to watch Mahout Mobile in Kerala Temple: ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి జీవితంలో 'స్మార్ట్‌ఫోన్' ఓ భాగమైపోయింది. అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్‌ఫోన్ లేని వ్యక్తి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతిఒక్కరు పక్కన ఉన్న మనుషులతో మాట్లాడకుండా.. స్మార్ట్‌ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారారు. కేవలం మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారిపోయాయి. ఇందుకు సంబందించిన వీడియోలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా గజరాజు ఏనుగుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... కేరళలోని కుంభకోణం శ్రీ కుంభీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ మావటి (ఏనుగు కేర్ టేకర్) తన స్మార్ట్‌ఫోన్ చూస్తూ ఉన్నాడు. మావటి కూర్చుని ఫోన్ చూస్తూ ఉండగా.. ఏనుగు నిలబడి ఉంది. మావటి ఫోన్ చూస్తూ ఉండడాన్ని గమనించిన ఏనుగు అతడి వద్దకు వస్తుంది. ఏనుగు కూడా ఫోన్ చూసేందుకు ప్రయత్నించింది. అయితే ఏనుగు నిలబడి ఉండడంతో.. దానికి ఫోన్ కనిపించదు. దీంతో కష్టపడి వంగివంగి చూడటానికి ప్రయత్నించింది.
ఏనుగు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తున్న వీడియోను 'kerala_elephants' అనే ఇన్‌స్టాగ్రామ్ యూసర్ పోస్ట్ చేశారు. 'ఏనుగు మరియు మావటి మధ్య సంబంధం, బంధం ప్రత్యేకమైనదే కాకుండా చాలా విలువైనవి' అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఏనుగు ఫోన్ చూడటానికి పడుతున్న కష్టం చూసి నేటిజన్స్ నవ్వుకుంటున్నారు. 'గజరాజుకు ఎంత కష్టం వచ్చే', 'పాపం ఏనుగు' అంటూ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 36k కంటే ఎక్కువ లైక్‌లు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
Also Read: మహిళ రోడ్డు దాటుతుండగా.. మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook