David warner Video: శ్రీ వల్లి పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్​- వీడియో వైరల్​

David warner video: ఆస్ట్రేలియన్ క్రికెటర్​ డేవిడ్ వార్నర్​ మరో కొత్త వీడయో చేశారు. ఇనెటర్నెట్​లో వైరల్ అవుతున్న ఆ వీడియో చూద్దామా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 11:09 AM IST
  • వైరల్​ అవుతున్న డేవిడ్​ వార్నర్​ కొత్త వీడియో
  • పుష్ప సినిమా సాంగ్​కు స్టెప్పులేసిన క్రికెటర్​
  • చివర్లో 'తగ్గేదే లే' సిగ్నేచర్​ మూమెంట్
David warner Video: శ్రీ వల్లి పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్​- వీడియో వైరల్​

David Warner Dance on Srivalli Song: అల్లు అర్జున్ హీరో​గా నటించిన 'పుష్ప' మూవీ గత ఏడాది రిలీజ్​ అయ్యాక సోషల్​ మీడియాలో ట్రెండ్స్​కు.. మూలంగా (Pushpa movie Trends) మారిపోయింది. సాధారణ జనంతో పాటు.. సెలెబ్రెటీలు సైతం ఈ సినిమా డైలాగ్స్​కు లిప్​ సింక్, చేస్తున్నారు, పాటలకు (Pushpa movie Songs) స్టెప్పులేస్తున్నారు.

సెలెబ్రెటీల్లో.. ఇలాంటి వీడియోల గురించి మాట్లాడుకుంటే.. ఆస్ట్రేలియన్ క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​ గురించి ముందుగా (David Warner Funny Video) చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా మొదటి లాక్​డౌన్ సమయంలో.. ఇన్​స్టాగ్రామ్​లో వరుసగా స్పూఫ్​ వీడియోలు, లిప్ సింక్​ వీడియోలు, డ్యాన్స్​ వీడియోలతో ఎంటర్​టైన్మెంట్ ఇచ్చాడు (David Warner viral video) వార్నర్​.

కొవిడ్ కారణంగా క్రికెట్ మ్యాచ్​లు ఆడలేకపోయినా.. వీడియోలు చేస్తూ డేవిడ్​ వార్నర్​ ఫుల్​ టైం పాస్​ చేశాడు. దీనితో ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డేవిడ్​ వార్నర్​కు లెక్కలేనంత మంది ఫ్యాన్స్​గా మారారు.

 డేవిడ్​ వార్న్​ చేసిన బుట్ట బొమ్మ సాంగ్​ డ్యాన్స్ వీడియో (David Warner Botta bomma video) ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మందికి ఈ వీడియో ఫేవరెట్​గా మారిపోయింది.

పుష్ప మూవీ విడుదలయ్యాక.. యమ క్రేజ్​ సాధించిన తగ్గేదే లే డైలాగ్​కు లిప్​ సింక్​ చేసి మెప్పించాడు వార్నర్​.

ఇప్పుడు మరో సారి.. పుష్ప సినిమాకు సంబంధించిన వీడియోతో ముందుకొచ్చాడు​. అదే 'చూపే బంగారామాయేనే' సాంగ్​లో అల్లు అర్జున్ చేసే డ్యాన్స్​. ఈ పాట తమిళ్​ వెర్షన్​కు స్టెప్పులేశాడు డేవిడ్ (David Warner Dance to Pushpa Song) వార్నర్​. చివర్లో తగ్గేదే లే డైలాగ్​ సిగ్నేచర్​ మూమెంట్ కూడా చేశాడు.

ఆ పాట చేయండి బ్రో..

'వాట్​ నెక్ట్స్' అనే క్యాప్షన్​తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్​. దీనితో ఆ వీడియో కింద కామెంట్స్​లో ఊ అంటావా మావా సాంగ్ చేయండి బ్రో.. అంటు ఇన్​స్టా యూజర్లు సలహా ఇస్తున్నారు. ఇంకా వేరే వేరే పాటలను కూడా (David Warner fans) సూచిస్తున్నారు.

Also read: Viral Video: బీటీఎస్​ స్టైల్ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ చూశారా..!

Also read: Video: ఈ డాగ్ నిజంగా హీరోనే.. ఆ జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News