Snake Catcher Catching 16 Feet King Cobra: 'సోషల్ మీడియా' ఒక అద్భుతమైన ప్రపంచం. అరచేతిలో ఉన్న మొబైల్ సాయంతో ఎన్నో అద్భుతాలను మనం రోజూ చుస్తునాం. సోషల్ మీడియా పుణ్యమాని మనం ఊహించలేని ఎన్నో విషయాలు కంటపడుతాయి. నెట్టింట చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు నవ్వించేవిగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోస్ మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుసలు కొడుతున్న డేంజరస్ కింగ్ కోబ్రాను ఓ స్నేక్ క్యాచర్ ఒట్టిచేతులతోనే సింపుల్‌గా పట్టేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొండ ప్రాంతం పక్కనే ఉన్న ఓ ఇంట్లో భారీ కింగ్ కోబ్రా దూరింది. ఆ ఇంటి యజమాని స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. నలుగురు స్నేక్ క్యాచర్‌లు ఓ కారులో పామును పట్టేందుకు వస్తారు. ఇంట్లో చాలా సమయం వెతికిన అనంతరం పాము వాషింగ్ మిషన్ కింద నక్కి ఉండడం గమనిస్తారు. మనుషుల శబ్దానికి బయపడిపోయిన పాము.. వాషింగ్ మిషన్ కింద నుంచి అస్సలు బయటికి రాదు. దాంతో ఇక చేసేది లేక స్నేక్ క్యాచర్‌లు వాషింగ్ మిషన్‌ను పక్కకు జరుపుతారు. ఓ స్నేక్ క్యాచర్ పాము తోకను పట్టుకుని బయటికి లాగుతాడు.
బయటికి వచ్చిన కింగ్ కోబ్రా భయంతో స్నేక్ క్యాచర్‌లపై దూసుకొస్తుంది. పడగవిప్పి బుసలు కొడుతుంది. అయినా కూడా స్నేక్ క్యాచర్‌లు భయపడరు. ఓ స్నేక్ క్యాచర్ పాము ముందుండగా.. ఇంకో స్నేక్ క్యాచర్ పాము వెనకాల నుంచి నెమ్మదిగా వస్తాడు. స్నేక్ క్యాచర్ తలను ఒట్టిచేతులతోనే సింపుల్‌గా పట్టేస్తాడు. ఆపై మిగతావారు వచ్చి పాము తోకను పెట్టేస్తాడు. పాము తలను నెమ్మదిగా సంచిలో వేసి బంధిస్తాడు.
బుసలు కొడుతున్న డేంజరస్ కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ సునాయాసంగా పట్టిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందుకు సంబందించిన వీడియోను 'Nick Wildlife' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 49,476 వ్యూస్ వచ్చాయి. 'బాగా పట్టావ్ బాసూ', 'గూస్ బంప్స్ పక్కా' అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీరు వీడియో చూసేసయండి.
Also Read: Best Mileage SUV 2023: ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. ఈ సూపర్ 5 ఎస్‌యూవీలపై ఓ లుక్కేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి