Cooking Mistakes: ఇంట్లో తయారుచేసిన ఆహారంలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రోజంతా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇంట్లో తయారుచేసిన భోజనంలో గరిష్ట పోషకాలు ఉండి శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది. అయితే స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లలో తినే అలవాటును పూర్తిగా మానేస్తే.. ఎలాంటి అనారోగ్యం సమస్యల బారిన పడరని నిపుణులు తెలుపుతున్నారు. కానీ చాలా ఇళ్లలో ఆహారాన్ని రుచిగా చేయాలనే తపనతో కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. దీని వల్ల ఆహారంలో పోషక విలువలు గణనీయంగా తగ్గుతున్నాయి. వంట చేసేటప్పుడు మీరు ఎప్పుడూ చేయకూడని పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనారోగ్యానికి గురి చేసే వంట పద్ధతులు:
వండి నీరు:
ప్రస్తుతం చాలా మంది కూరగాయలను లేదా అన్నాన్ని వండే క్రమంలో నీటి శాతం అధికమైతే వాటిని తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల వండి వంటకాల్లో పోషకాలు తగ్గిపోయి అనారోగ్యానికి గురి చేస్తుంది. అయితే ఆ నీరు తొలగించకుండా ఓ బౌల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని ఏదైనా కూర లేదా పప్పు చేసినప్పుడల్లా అందులో వాడుకోండి. తద్వారా శరీరానికి పోషకాలు సక్రమంగా అందుతాయి.
కూరగాయల తొక్కలను తీసివేయకూడదు:
కూరగాయల తొక్కలను (పీల్స్)చాలా మంది తొలిచివేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పొరలో ఉండే అనేక పోషకాలు తొలగిపోయే అవకాశాలున్నాయి. తొక్కలను పారేసే బదులు, పొట్టు తీయకుండా కూరలను చేసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డీప్ ఫ్రై:
ఆహారాన్ని బాగా వేయించినట్లయితే, ఆహారంలో ఉండే పోషక విలువలు దాని నుంచి తొలగిపోయి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
చెడిపోయిన నాన్ స్టిక్ పాత్రల వాడకం:
ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో నాన్‌స్టిక్ ఫ్యాన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ పాత్రలలో నాన్ స్టిక్ టాప్ కోటింగ్ చెడిపోయిన తర్వాత కూడా వీటిని వాడుతున్నారు. ఇది ఆహారానికి చాలా హాని కలిగిస్తుంది. కావున ఈ నాన్‌స్టిక్ ఫ్యాన్‌ల వాడకం తగ్గించి ఐరన్, సిరామిక్, స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన వంట ఫ్యాన్‌లలో వండడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Jamun Fruit Benefits: నేరేడు పండు వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు..!!
Also Read: Curd Benefits On Hair: పెరుగు వల్ల జుట్టుకు ఇన్ని లాభాలా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి