Children's Day 2021: బాలల దినోత్సవం నవంబర్ 14కి ఎలా మారిందో తెలుసా ?

Children's Day 2021: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నవంబర్ 20న బాలల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుండగా భారత్‌లో మాత్రం నవంబర్ 14నే బాలల దినోత్సవం (Children's Day 2021 / Bal Diwas 2021) జరుపుకోవడానికి వెనుకున్న కారణం ఏంటి ? భారత్‌లో బాలల దినోత్సవం తేది ఎప్పటి నుంచి మారింది ? ఈ మార్పు వెనుకున్న కారణాలు ఏంటనేది మాత్రం కొందరికే తెలుసు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 08:59 AM IST
  • ప్రతీ సంవత్సరం నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవం వేడుకలు
    బాలల దినోత్సవం (Children's Day) నవంబర్ 20 నుంచి నవంబర్ 14కి ఎలా మారింది ?
    భారత్‌లో బాలల దినోత్సవం (Bal Diwas) తేదీని ఎందుకు మార్చాల్సి వచ్చింది ?
Children's Day 2021: బాలల దినోత్సవం నవంబర్ 14కి ఎలా మారిందో తెలుసా ?

Children's Day 2021: నవంబర్ 14వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం సెలబ్రేట్ చేసుకునేది ఈ రోజే. పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు, వేడుకలతో అంగరంగ వైభవంగా బాలల దినోత్సవం జరుపుకుంటుంటాం. అయితే, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నవంబర్ 20న బాలల దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుండగా భారత్‌లో మాత్రం నవంబర్ 14నే బాలల దినోత్సవం (Children's Day 2021 / Bal Diwas 2021) జరుపుకోవడానికి వెనుకున్న కారణం ఏంటి ? భారత్‌లో బాలల దినోత్సవం తేది ఎప్పటి నుంచి మారింది ? ఈ మార్పు వెనుకున్న కారణాలు ఏంటనేది మాత్రం కొందరికే తెలుసు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Jawaharlal Nehru birth anniversary - జవహార్ లాల్ నెహ్రూ జయంతి: 
నవంబర్ 14 భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి. బాల, బాలికలు అంటే జవహార్ లాల్ నెహ్రూకి ఎంతో ఇష్టం. బాలలంతా ముద్దుగా ఆయన్ను చాచా నెహ్రూ అని పిలుచుకునే వాళ్లు. ''నేటి బాలలే రేపటి పౌరులు. రేపు దేశం బాగుండాలన్నా.. దేశ భవిష్యత్తు బాగుండాలన్నా.. అది నేటి బాలల చేతుల్లోనే ఉంటుంది'' అని బలంగా నమ్మిన గొప్ప మనిషి, స్వాతంత్ర్య సమరయోధుడు జవహార్ లాల్ నెహ్రూ. అందుకే ప్రతీ సంవత్సరం జవహార్ లాల్ నెహ్రూ జయంతినే భారత్‌లో బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 

Also read : World Coconut Day 2021: కొబ్బరితో కోటి లాభాలు..! ఆ ప్రయోజనలేంటో తెలుసుకుందామా!

ఒక రాజకీయ నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా నేటి బాలలకు చక్కటి విద్యను అందిస్తే.. వారే రేపు దేశాన్ని నిర్మిస్తారు అని నమ్మిన గొప్ప వ్యక్తిగానూ జవహార్ లాల్ నెహ్రూకి (Jawaharlal Nehru) ఎంతో మంచి గుర్తింపు ఉంది. 

బాలల దినోత్సవం నవంబర్ 20 నుంచి నవంబర్ 14కి ఎలా మారిందంటే..
జవహార్ లాల్ నెహ్రూ 1964లో కన్నుమూశారు. అంతకు ముందు వరకు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కూడా నవంబర్ 20నే (World's Children's Day 2021) ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుండేది. జవహార్ లాల్ నెహ్రూ మృతి అనంతరం ఆయనను స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా (Bal Diwas 2021) సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలా అప్పటి నుంచి నవంబర్ 14న దేశంలో బాలల దినోత్సవం (Children's Day 2021) జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మొదలైందని చరిత్ర చెబుతోంది.

Also read : World Blood Donor Day 2021: రక్తదాతల దినోత్సవం, ఈ ఏడాది థీమ్ ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News