Bride Funny Video: పారిపోతున్న వరుడిని నడి రోడ్డుపై ఛేజ్ చేసిన వధువు.. ఫుల్ టు కామెడీ! అచ్చు సినిమా మాదిరప్పా

Bride Funny Video, Bride Runs On the road for Bridegroom. పారిపోతున్న వరుడిని వధువు నడి రోడ్డుపై ఛేజ్ చేసి మరీ పెళ్లి చేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 30, 2022, 03:12 PM IST
  • వరుడి కోసం నడి రోడ్డుపై పరుగెత్తిన వధువు
  • ఫుల్ టు కామెడీ
  • అచ్చు సినిమా మాదిరప్పా
Bride Funny Video: పారిపోతున్న వరుడిని నడి రోడ్డుపై ఛేజ్ చేసిన వధువు.. ఫుల్ టు కామెడీ! అచ్చు సినిమా మాదిరప్పా

Bride chased Bridegroom on Road after he Refuses to Get Married: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం చాలా సరదాగా ఉంటాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పారిపోతున్న వరుడిని వధువు నడి రోడ్డుపై ఛేజ్ చేసి మరీ పెళ్లి చేసుకుంది. 

టైమ్స్ నౌ నివేదిక ప్రకారం.. బీహార్‌లోని నవాడా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, అబ్బాయికి మూడు నెలల క్రితం నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం సమయంలో వధువు కుటుంబ సభ్యులు బైక్‌తో పాటు రూ. 50 వేల నగదును వరుడికి కట్నంగా ఇచ్చారు. అయితే వరుడు పలు సాకులు చెబుతూ పెళ్లిని ఆలస్యం చేస్తూ వచ్చాడు. కొన్ని రోజులుగా వధువు కుటుంబ సభ్యులకు కనబడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. 

నవాడాలోని భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలోని మార్కెట్‌లో వరుడిని వధువు గుర్తించింది. వెంటనే కుటుంబ సబ్యులకు చెప్పడంతో. అందరూ కలిసి వరుడిని పట్టుకున్నారు. 'నన్ను పెళ్లి చేసుకో' అంటూ వధువు ప్రాధేయపడింది. అదేమీ పట్టించుకోని వరుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నడి రోడ్డుపై వరుడు పరుగెత్తసాగాడు. దాంతో వధువుతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులు కూడా వరుడిని ఛేజ్ చేశారు. చివరకు వరుడిని పట్టుకుని పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదని గొడవ చేశారు. 

ఆ గొడవలోకి చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వధువు తనకు పెళ్లి చేసుకోవాలి ఏడ్చుకుంటూ కూర్చుంది. దాంతో పోలీసులు ఇరువర్గాలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కౌన్సెలింగ్‌ అనంతరం వరుడు పెళ్లికి అంగీకరించాడు. చివరకు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న గుడిలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 'Exclusive Post' ట్విటర్ ఖాతాలో వీడియో ఉంది. ఈ వీడియోకు లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తోంది. 

Also Read: పెళ్లికి ముందు జిమ్‌లో వధువు వర్కౌట్స్.. పాపం వరుడు! ఇక అత్తింటివారి పనైపోయింది పో

Also Read: Kadium Vs Rajaiah: కడియం శ్రీహరి 361 మందిని బలి తీసుకున్నారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్లతో కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News