Bride Gym Viral Video: పెళ్లికి ముందు జిమ్‌లో వధువు వర్కౌట్స్.. పాపం వరుడు! ఇక అత్తింటివారి పనైపోయింది పో

Bride Gym Funny Video, Bride doing Pre Wedding photoshoot in Gym. తమిళనాడుకు చెందిన ఓ యువతి తన 'ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌' సరికొత్తగా ప్లాన్ చేసింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 30, 2022, 02:16 PM IST
  • పెళ్లికి ముందు జిమ్‌లో వధువు వర్కౌట్స్
  • పాపం వరుడు
  • ఇక అత్తింటివారి పనైపోయింది పో
Bride Gym Viral Video: పెళ్లికి ముందు జిమ్‌లో వధువు వర్కౌట్స్.. పాపం వరుడు! ఇక అత్తింటివారి పనైపోయింది పో

Bride doing Pre Wedding photoshoot in Gym: ఒకప్పుడు పెళ్లి అంటే.. ఒక్క ఫొటో కూడా ఉండేది కాదు. కొంత కాలం తర్వాత పెళ్లిళ్లలో ఫొటోస్ తీయించుకున్నారు. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. కేవలం ఫొటోస్ మాత్రమే కాకుండా వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు పెళ్లి, రిసెప్షన్‌లో ఫొటోస్ తీసుకునే వారు.. ప్రస్తుతం పెళ్లికి ముందే 'ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌' అంటూ ఫొటోస్ తీయించుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్ సరికొత్తగా ఉండేలా యువత ఆరాటపడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బురదలో ఫొటోషూట్‌ చేయగా.. తాజాగా జిమ్‌ చేస్తూ కూడా ఫొటోషూట్‌ చేశారు. 

తమిళనాడుకు చెందిన ఓ యువతి తన 'ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌' సరికొత్తగా ప్లాన్ చేసింది. ఎవరూ ఊహించని, ఇదివరకు ఎవరూ చేయని విధంగా ఫొటోషూట్‌ చేసి సోషల్ మీడియాలో స్టార్ అయింది. సదరు యువతి జిమ్‌లో  'ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌' తీయించుకుంది. పట్టుచీర కట్టి, ఆభరణాలు ధరించి.. జిమ్‌లో బరువులెత్తుతూ ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లో పాల్గొంది. ముఖ్యంగా డంబెల్స్ ఎత్తుతూ ఫొటోలకు నవ్వుతూ పోజులిచ్చింది. ఈ షూట్ చూసిన అక్కడి వారు ముసిముసిగా నవ్వుకున్నారు. అవేమీ పట్టించుకోని ఆ యువతి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. 

తమిళనాడుకు చెందిన ఓ యువతి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'సంయుక్త' అనే ట్విటర్‌ యూజర్‌ ఈ 'ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌' వీడియోను పోస్ట్‌ చేసింది. 'ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌. భర్త, అత్తింటివారికి స్పష్టమైన హెచ్చరిక ఇదే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'పాపం వరుడు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఇక అత్తింటివారి పనైపోయింది పో' అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు. 

Also Read: విరాట్ సాధారణ ఆటగాడిగా కనిపిస్తున్నాడు.. కోహ్లీ ఆడింది గొప్ప ఇన్నింగ్స్‌ కాదు: పాక్ ప్లేయర్ 

Also Read: Kuppam Clash: కుప్పంలో మళ్లీ అల్లర్లు..చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ధ్వంసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News