Black King Cobra Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయించిన బ్లాక్ కింగ్ కోబ్రా

Snake hunters discovered nest of black king cobra. ముగ్గురు స్నేక్ క్యాచర్‌లను ఓ బ్లాక్ కింగ్ కోబ్రా ఉచ్చ పోయించింది. భారీ ఎత్తున పడగెత్తి కాటేయడానికి మీదికి వచ్చింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 27, 2023, 12:43 PM IST
  • బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను పట్టేసిన అమ్మాయి
  • వీడియో చూస్తే షాక్ అవ్వడం పక్కా
  • వీడియోకి 45,101 వ్యూస్
Black King Cobra Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయించిన బ్లాక్ కింగ్ కోబ్రా

18 Feet Black King Cobra scared 3 Snake Catchers: ‘పాము’ అనే పదం వింటేనే చాలా మంది వణికిపోతారు. అది 'కింగ్ కోబ్రా' అయితే ఇంకేమైనా ఉందా.. భయంతో వణికిపోతారు. అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా కింగ్ కోబ్రాలకు ఆమడ దూరంగా ఉంటాయి. ఎందుకంటే అత్యంత విషపూరిత పాము కింగ్ కోబ్రానే. ఈ పాము కాటుకు బలమైన ఏనుగు కూడా మరణిస్తుంది. సాధారణంగా అటవి ప్రాంతాలలో సంచరించే కింగ్ కోబ్రా చాలా సిగ్గరి. ఎవరి కంట దాదాపుగా పడవు. అయితే కింగ్ కోబ్రాను రెచ్చగొడితే మాత్రం చాలా ప్రమాదకరంగా మారుతుంది. మూడో వంతు పడగెత్తి కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. ఒక్కోసారి స్నేక్ క్యాచర్‌లకు ఉచ్చ పోయిస్తుంది. అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు పొలాల మధ్యలో సంచరిస్తూ కింగ్ కోబ్రా ఉండే బొరియను కనుగొంటారు. ముగ్గురు కలిసి ఆ బొరియను తొవ్వుతుండగా.. చిన్నపాటి రంద్రం కనిపిస్తుంది. కచ్చితంగా ఇందులో కింగ్ కోబ్రా ఉంటుందని నమ్మిన వారు బొరియను మరింత తవ్వుతారు. వారికి అందులో ఓ 15 అడుగుల బ్లాక్ కింగ్ కోబ్రా కనిపిస్తుంది. స్టిక్ సాయంతో దాన్ని బయటికి తీయగా.. అది కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. బొరియలో మరో పెద్ద బ్లాక్ కింగ్ కోబ్రా బయటికి వస్తుంది. 

రెండో బ్లాక్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు రాగా.. అది కోపంతో కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. తృటిలో వారు తప్పించుకుంటారు. అయినా కూడా అది ఆగదు. తోకను పట్టుకోవడానికి వస్తుండగా భారీ ఎత్తున పడగెత్తి దూసుకొస్తుంది. దాంతో ఇద్దరు స్నేక్ క్యాచర్‌లు భయంతో పారిపోతారు. మరో స్నేక్ క్యాచర్‌ మాత్రం చాలా దైర్యం చేసి దాన్ని పట్టుకునేందుకు వస్తాడు. చివరకు రెండో బ్లాక్ కింగ్ కోబ్రాను అదుపు చేస్తాడు. లేడీ స్నేక్ క్యాచర్‌ వచ్చి సంచి దాని తలపై వేసి బంధిస్తుంది. ఆపై మరో పామును కూడా అలానే బంధిస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News