Bizarre Alien Creature: రోడ్డుపై ప్రత్యక్షమైన అంతుచిక్కని వింత జీవి.. అదేంటో గుర్తించలేక జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు

Bizarre Alien Creature: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ వింత జీవి ప్రత్యక్షమైంది. రోడ్డుపై జాగింగ్ చేస్తున్న ఓ వ్యక్తి దీన్ని గుర్తించి సెల్‌ఫోన్‌లో బంధించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 04:05 PM IST
  • ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమైన వింత జీవి
  • ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన హేస్ అనే వ్యక్తి
  • ఆ వింత జీవిని గుర్తించలేక జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు
Bizarre Alien Creature: రోడ్డుపై ప్రత్యక్షమైన అంతుచిక్కని వింత జీవి.. అదేంటో గుర్తించలేక జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు

Bizarre Alien Creature: ఇంటర్నెట్‌లో అప్పుడప్పుడు కొన్ని వింత జీవుల వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఆ వింత జీవులను గుర్తించలేక నెటిజన్లు జుట్టు పీక్కుంటుంటారు. ఎవరూ వాటిని గుర్తించలేని పక్షంలో ఇక అవి గ్రహాంతర జీవులేనన్న నిర్ణయానికి వస్తారు. తాజాగా ఓ వింత జీవి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వింత జీవి ఏమిటనేది ఎవరూ గుర్తించలేకపోతున్నారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన హేస్ అనే వ్యక్తి ఇటీవల ఓరోజు ఉదయం జాగింగ్ చేస్తుండగా రోడ్డుపై ఈ వింత జీవిని గుర్తించాడు. దాని ముందు భాగం ఏనుగు తొండం ఆకారంలో కనిపిస్తోంది. దాన్ని చిన్నపాటి కర్రతో అక్కడి నుంచి కదిపే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆ జీవి అక్కడి నుంచి ఇంచు కూడా కదల్లేదు. హేస్ దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు.

ఆ వింత జీవి ఏమిటనేది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కట్లేదు. బహుశా అది షార్క్ పిండం అయి ఉండొచ్చునని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బయాలజిస్టులు సైతం ఈ వింత జీవిని గుర్తించలేకపోతున్నారు. ఎలి ఎలిసా అనే బయాలజిస్ట్ స్పందిస్తూ.. అది ఉడుత లాంటి జీవి అయి ఉండొచ్చునని కామెంట్ చేశారు. అయితే తన సహచరులెవరూ దాన్ని అంగీకరించట్లేదన్నారు. బయాలజిస్టులు సైతం చేతులెత్తేయడంతో.. ఈ వింత జీవిని గుర్తించడం కష్ట సాధ్యంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Also Read: Radhe Shyam Trailer: రాధేశ్యామ్ మూవీ రెండో ట్రైలర్ వచ్చేసింది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @_harryhayes

Trending News