Corruption Accused Assam Politician Seen Sleepin On Bed Of Notes: సాధారణంగా అవినీతికి పాల్పడిన అధికారులు సీబీఐ, ఈడీలు, ఏసీబీలు వలపన్ని పట్టుకుంటారు. కొందరి దగ్గర వందలాది నోట్ల కట్టలు గుట్లలుగా దొరుకుతాయి. ట్రంక్ పెట్టెలలో, బీరువాలలో, మంచాలలో ఎక్కడెక్కడో అవినీతి సోమ్ములను దాచిపెడుతుంటారు. మరికొందరు బ్యాంక్ లాకర్ లలో, ఇతరుల ఇళ్లలో, భూమిలో ప్రత్యేకంగా ఐరన్ తో ఏర్పాట్లు చేసి మరీ డబ్బులను దాచిపెడుతుంటారు. ముఖ్యంగా కొందరు ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టెట్ రంగాలవారు, పొలిటిషియన్స్ లు ఈవిధంగా అక్రమంగా డబ్బులు సంపాదించి,కుప్పలుగా సొమ్ముతో అడ్డంగా దొరికిపోయిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో ఈడీ, ఏసీబీ అధికారులు వీడిని సీజ్ చేస్తుంటారు.
Read More: Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..
ఏసీబీ కోర్టులో హజరుపరుస్తుంటారు. ఆదాయపు పన్ను శాఖలకు లెక్కలు చూపించకుండా, ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్సాంకు చెందిన రాజకీయ నాయకుడు నోట్ల మంచంపై నిద్రపోతున్న దృశ్యం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. అస్సాంలోని ఉదల్‌గిరి జిల్లాలోని భైరగురిలో విలేజ్ కౌన్సిల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ బెంజమిన్ బసుమతరీ ₹ 500 నోట్లు పరుచుకున్న మంచం మీద నిద్రిస్తున్నాడు. అతనిపై కూడా కొన్ని నోట్లు కుప్పలుగా చెల్లాచెదురుగా పడిఉండటం కనిపిస్తున్నాయి.
ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం, గ్రామీణ ఉద్యోగాల పథకంతో ముడిపడి ఉన్న భారీ అవినీతి కేసులో బోడోలాండ్ నాయకుడు నిందితుడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒడల్‌గూరి డెవలప్‌మెంట్ జోన్‌లోని తన వీసీడీసీ పరిధిలోని పీఎంఏవై, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకాల పేద లబ్ధిదారుల నుంచి అతడు లంచం తీసుకున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో.. ప్రమోద్ బోరో, UPPL చీఫ్, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, ఈ ఉదయం ఒక వివరణ ఇచ్చారు. Mr బసుమతరీ ఇకపై పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
బెంజమిన్ బాసుమత్రి ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా హల్ చల్ చేస్తోంది.
Read More: Viral Video: స్కూల్ టీచర్ ను చెప్పులతో కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్..
జనవరి 10, 2024న పార్టీ నుండి సస్పెండ్ చేయబడినందున శ్రీ బసుమత్రికి ఇకపై UPPLతో సంబంధం లేదని మేము స్పష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, హరిసింగ బ్లాక్ కమిటీ, UPPL నుండి 5 జనవరి, 2024న లేఖ అందుకున్న తర్వాత అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మిస్టర్ బోరో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook