Gandhi Hospital Gang Rape: బయటకి వచ్చిన సంచలన నిజాలు.. మహిళ ఇష్టంతోనే!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గాంధీ ఆసుపత్రిలో జరిగిన సామూహిక అత్యాచరం కేసులో రెండో మహిళ ఆచూకి లభించటంతో సంచలన నిజాలతో పాటు, ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2021, 04:57 PM IST
  • ఆచూకి తెలియని రెండో మహిళ లభ్యం
  • సీసీ కెమెరాల ఆధారంగా మహిళ ఆచూకి కనుగొన్న పోలీసులు
  • వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు
Gandhi Hospital Gang Rape: బయటకి వచ్చిన సంచలన నిజాలు.. మహిళ ఇష్టంతోనే!

Hyderabad: ఆచూకి తెలియని రెండో మహిళ లభ్యంతో గాంధీ ఆసుపత్రిలో (Gandhi Hospital)జరిగిన సాముహిక అత్యాచారం (Gang Rape)కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలం రేపిన గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్ కేసును పోలీసులు చేదించారు.

కిడ్నీలు పాడైన వ్యక్తి తన భార్య మరియు ఆమె చెల్లెలితో గాంధీ ఆసుపత్రిలో చేరాడు.. వీరికి దూరపు చుట్టమైన  రేడియాలజీ (Radiologist) విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్‌ (Uma maheshwar) సహాయంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా పేషంట్ భార్య, మరదలు కనపడకపోవటం.. రెండు రోజుల తరువాత మరదలు సెల్లార్ లో అపస్మారక స్థితిలో కనపడటం, వారిపై గ్యాంగ్ రేప్ జరపరాని భాదిత మహిళ పోలీసులను ఆశ్రయించటం.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..

Also Read: India Corona update: దేశంలో పెరిగిన కరోనా కేసులు... నమోదైన 36,401 కేసులు

కానీ  రెండో మహిళ దొరికిన తరువాత కొన్ని సంచలన నిజాలు బయటకి రావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా రెండో మహిళ ఉన్న ప్రాంతాన్ని పోలీసు బృందాలు కనిపెట్టినట్టు తెలుస్తుంది.  ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏమిటంటే, కనపడకుండా పోయిన రెండో మహిళ తన ఇష్టపూర్వకంగానే ఓ వ్యక్తి తో రెండు రోజుల పాటు వెళ్లినట్టు విచారణలో తేలిందని సమాచారం. ఆ మహిళకు రెండు రోజులుగా చోటు కల్పించిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఈ కేసులో మరో  ట్విస్ట్ ఏంటంటే.. భాదితు మహిళలపై ఎలాంటి మత్తు ప్రయోగం జరగలేదని, వాటి సంబంధిత పదార్థాలు ఏవి జరిపిన వైద్య పరీక్షల్లో నిర్దారణ కాలేదని వైద్యులు నివేదికను పోలీసులకు అందించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రేడియాలజీ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్‌ మరియు మరో వ్యక్తిని పోలీసులు నిర్దోషులుగా తేల్చినట్టు సమాచారం.

Also Read: Jr NTR: హాట్ టాఫిక్ గా ఎన్టీఆర్ ఖరీదైన కారు...దేశంలో తొలి వ్యక్తిగా రికార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News