King Cobra Video: సప్తగిరుల్లో నాగుపాములు హల్‌చల్ చేస్తున్నాయి. శేషాచలం కొండల్లో శేషనాగులు కలవర పరుస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు పాములు కనిపిస్తుండడంతో తిరుమల భక్తులు భయాందోళన చెందుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షాలకు పాములు బయటకు వస్తూ తిరుమలలో సంచరిస్తున్నాయి. వాటిని చూసి భక్తులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా సహజసిద్ధ శిలాతోరణం వద్ద పాము ప్రత్యక్షమైంది. ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న పాము బుసలు కొడుతూ కనిపించింది.
Also Read: Stag Beetle: బీఎండబ్ల్యూ, బెంజ్ కారు కన్నా ఈ పురుగు చాలా కాస్టిలీ.. ఏమంత స్పెషలో తెలుసా?
తిరుమలలో సోమవారం నాగుపాము కలకలం రేపింది. శిలాతోరణం దగ్గర 8 అడుగుల నాగుపాముని భక్తులు గుర్తించారు. శిలాతోరణం పక్కన ఉన్న పొదల్లో పాము సంచరిస్తూ కనిపించడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. భక్తుల కేకలు విని వెంటనే తిరుమ తిరుపతి దేవస్థానం అధికారులు రంగంలోకి దిగారు. స్థానిక టీటీడీ అధికారి పాములు పట్టే భాస్కర్ నాయుడుకి సమాచారం అందించారు.
Also Read: Letter To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు యువతి లేఖ.. ఏం రాసిందో తెలుసా?
వెంటనే రంగంలోకి దిగిన భాస్కర్ నాయుడు పామును చాకచక్యంగా పట్టుకున్నారు. చేతులకు గ్లౌజులు వేసుకుని శిలాతోరణం వద్ద పామును పట్టుకుని ఆ సమీపంలోని పార్క్‌లో సురక్షితంగా వదిలారు. పామును ఆయన బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం కావడంతో ఇటీవల తిరుమల పరిసర ప్రాంతాల్లో కొండచిలువలు, నాగుపాముల సంచారం తీవ్రమైంది. భక్తులు అప్రమతంగా ఉండాలని సూచిస్తున్నారు. తిరుమలలోని అటవీ ప్రాంతం నుంచి వర్షాలకు సరీసృపాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ భక్తులకు తగు సూచనలు, జాగ్రత్తలు చెబుతోంది.
తిరుమలలో 8 అడుగుల నాగుపాము కలకలం#Snake #8feet #Tirumala pic.twitter.com/FTAlJXfh0N
— Zee Telugu News (@ZeeTeluguLive) July 8, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter