2 Deers battle: బార్డర్ లో కుమ్ముకున్న భారత్ ,పాక్ జింకలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

2 Deers fight at border: ఇండియా, పాక్ బార్డర్ దగ్గర రెండు జింకలు కుమ్ముకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తగ్గెదేలా .. అంటూ కామెంట్లు చేస్తున్నారు..  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 29, 2024, 11:07 PM IST
  • పాక్ జింకకు దిమ్మతిరిగే షాక్..
  • వైరల్ గా మారిన మూగ జీవాల పోరాటం..
2 Deers battle: బార్డర్ లో కుమ్ముకున్న భారత్ ,పాక్ జింకలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

2 Deers fight at border video goes viral: దాయాదీ పాక్ భారత్ పై ఎప్పుడు కూడా ఏదో రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతు ఉంటుంది. ఎక్కడ చాన్స్ దొరుకుతుందా.. మన దేశంలోకి చొరబడేందుకు నానా దొంగ వేషాలు వేస్తుంటుంది. ఇండియన్ సోల్జర్స్ కోసం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాక్ చర్యలను సమర్థవంతంగా  తిప్పికొడుతున్నారు.

 

బార్డర్ లో తరచుగా భారత్ , పాక్ ల మధ్య కాల్పులు, చొరబాట్ల కు సంబంధించిన గొడవలు జరుగుతు ఉంటాయి. ఇండియన్ సోల్జర్స్ ఎప్పటికప్పుడు పాక్ నియంత్రణ రేఖ దాటి లోపలికి రాకుండా.. నిరోధిస్తుంటారు. ఇదిలా ఉండగా.. బార్డర్ వద్ద రెండు జింకలు కయ్యానికి కాలు దువ్వుకోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

సాధారణంగా బార్డర్ లో ఇండియా,పాక్ సైనికులు గొడవ పడుతుంటారు. పాక్ చేసే చర్యలకు భారత్ తిప్పికొడుతుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ ల మధ్య బార్డర్ వద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బార్డర్ కు అవతల ఒక జింక, ఈపక్క మరో జింకలు కుమ్ముకున్నాయి. రెండు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. ఒకదానికి మరోకటి బలంగా కుమ్ముకుంటున్నాయి. ఒక బీఎస్ఎఫ్ ఆఫీసర్ జింకలు కొమ్ములతో కొవడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Read more: Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..

దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ చూసినట్లుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. తగ్గెదెలా.. పాక్ కు గట్టిగానే బుద్ది చెప్పిందిగా జింక.. అంటూ కామెంట్లుచేస్తున్నారు. నోరులేని జీవాలు సైతం.. భారత్ జోలికి వస్తే ఊరుకోవంటూ కూడా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం ట్రెండింగ్ లో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News