Zomato CEO's Unique Job Offer : జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి ఖాళీని ప్రకటించారు.అయితే ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి మొదటి ఏడాది జీతం ఇవ్వబోమని చెప్పారు. అందుకు విరుద్ధంగా రూ.20 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.వినూత్న ఉద్యోగాన్ని పరిచయం చేశారు జొమాటో సీఈవో. మీరు అప్లయ్ చేయాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
Zomato CEO's Unique Job Offer : ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ప్రత్యేకమైన జాబ్ ఆఫర్‌ను అందించారు. ఇందులో ఎంపికైన వ్యక్తి మొదటి ఏడాది రూ.20 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' పదవికి కాబోయే అభ్యర్థులు మొదటి సంవత్సరానికి రూ. 20 లక్షలు చెల్లించాలని గోయల్ కోరారు. ఈ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్ ఇండియాకు విరాళంగా అందజేస్తామని గోయల్ బుధవారం తెలిపారు. ప్రతిగా అభ్యర్థి ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద సంస్థకు కంపెనీ రూ. 50 లక్షలు విరాళంగా అందజేస్తుంది. ఈనేపథ్యంలో స్పందిస్తూ... గోయల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిదీ చేయగలనని రాశారు.
టాప్ మేనేజ్‌మెంట్ స్కూల్ నుండి రెండేళ్ల డిగ్రీ కంటే ఈ పాత్ర 10 రెట్లు ఎక్కువ అభ్యాస అవకాశాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది నాతో , వినియోగదారు సాంకేతికతలో అత్యంత ఆలోచనాత్మకమైన వ్యక్తులతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది.
అయితే, ఈ పాత్ర అటువంటి ఉద్యోగాలతో వచ్చే సాధారణ ప్రోత్సాహకాలతో కూడిన సాంప్రదాయ పాత్ర కాదు," అతను జీతం వివరాలపై "అక్కడ మొదటి సంవత్సరంలో ఈ పోస్ట్‌కి ఎటువంటి జీతం ఉండదు, ఈ 'ఫీజు'లో 100 శాతం నేరుగా ఫీడింగ్ ఇండియాకు అందిస్తాము అని పేర్కొన్నారు.
అయితే మరో విచిత్రం ఎంటంటే ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేని కేవలం కండిషన్స్ ఒప్పుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఉద్యోగం ఇస్తానంటూ కండిషన్ పెట్టింది. అంతేకాదు ఉద్యోగికి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలని..అలానే నేర్చుకునే మనస్తత్వం ఉండాలని డౌన్ టు ఎర్త్ ఉండాలంటూ నిబంధనల్లో పేర్కొంది.
ఇక జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ప్రస్తుత జొమాటో ఆధ్వర్యంలో నడిచే బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్, ఫీడిండ్ ఇండియా సంస్థల్లో కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. పేరుకు 50లక్షల వేతనం కానీ ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరం ఎలాంటి జీతం చెల్లించరు.
అంతేకాదు ఉద్యోగంలో చేరే ముందు 20లక్షలు మీరే స్వయంగా కంపెనీకి చెల్లించాలి. ఈ మొత్తం ఫీడింగ్ ఇండియా అనే సంస్థకు వంద శాతం డొనేషన్ రూపంలో చెల్లిస్తారు. రెండవ సంవత్సరం మీకు యాధావిథిగా ముందు పేర్కొన్న వేతనం లభిస్తుంది.
ఇక ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లయ్ చేసుకోవాలనుకుంటున్నారో వారు 200పదాలతో ఒక కవరింగ్ లెటర్ తో తమను తాము పరిచయం చేసుకుంటూ అధికారిక ఈమెయిల్ ఒక మెయిల్ పెట్టాలి. ఎలాంటి రెజ్యూమ్స్ అవసరం లేదని సంస్థ పేర్కొంది.