Wifi Internet: ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ అనేది సర్వ సాధారణంగా మారింది. ప్రతి ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం ఉంటోంది. వైఫై రౌటర్ సహాయంతో ఇంట్లో అన్ని డివైస్‌లకు ఇంటర్నెట్ సౌకర్యం వర్తిస్తుంది. రౌటర్ మీరు ఇన్‌స్టాల్ చేసే ప్రదేశం కూడా వైఫై వేగాన్ని నియంత్రిస్తుంది. అందుకే ఇంట్లో వైఫై ఏయే ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేయకూడదో తెలుసుకుందాం..
మల్టీ స్టోరీస్ ఇళ్లు అయితే మధ్యలో ఉండే ఫ్లోర్‌లో వైఫై రౌటర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డౌన్ ఫ్లోర్, పై ఫ్లోర్‌కు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటుంది.
వైఫై రౌటర్‌ను స్టూల్ లేదా టేబుల్‌పై ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంటర్నెట్ సరిగ్గా అందదు. వైఫై రౌటర్ ఎప్పుడూ ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.
వైఫై రౌటర్‌ను ఇంట్లో క్లోజ్డ్ రూమ్‌లో అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ఇంటర్నెట్ సరిగ్గా అందదు.
పూర్తిగా కవర్ అయి కన్పించని ప్రదేశాల్లో వైఫై రౌటర్ ఉంచకూడదు. దీనివల్ల నెట్‌వర్క్ సరిగ్గా అందదు
వైఫై రౌటర్ అనేది ఎప్పుడూ ఇంట్లో సెంటర్ చూసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కవరేజ్ బాగుంటుంది.