Summer Heat Season: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూయిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే కనీసం బైటచూడటానికి కూడా భయమేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో చాలా మంది వడదెబ్బ ప్రభావానికి గురౌతున్నారు.
ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు మార్చినెలలోనే మండిపోతున్నాడు. ఇప్పటికే అనేక చోట్ల భారీగా వేడిగాలులు కూడా వీస్తున్నాయి. ఈక్రమంలోనే ఎండలో ఉద్యోగాలకు, బిజినెస్ ల కోసం బైటకు వెళ్తున్న చాలా మంది వడదెబ్బ ప్రభావానికి గురౌతున్నట్లు సమాచారం.
కొందరికి నీళ్లు తాగే అలవాటు చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు వడదెబ్బ ప్రభావానికి తొందరగా గురౌతారు. వడదెబ్బ తగలగానే ఒక్కసారిగా బాడీ అంతా వేడెక్కిపోతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి.
కొందరికి శ్వాస తీసుకొవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నాలుక తడారిపోతుంది. తలనొప్పిగా ఉంటుంది. ఇలాంటి వారు వెంటనే నీడలో తీసుకెళ్లాలి. వెంటనే శరీరంపైన ఉన్న బట్టలను తీసి, గాలి అందేలా చూడాలి..
చల్లని నీళ్లలో బట్టను ముంచి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరంమంతా తుడవాలి. కొందరికి గుండె కూడ వేగంగా కొట్టుకుంటుంది. అపస్మారక స్థితిలోకి కూడా వెళ్తారు. ఇలాంటి క్రమంలో వారికి ప్రాథమిక చికిత్సఅందించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
అత్యవసరమైతేనే తప్ప ఇంట్లో నుంచి ఉదయం 11 తర్వాత బైటకు వెళ్లకూడదు. అలానే తిరిగి సాయంత్రం 4 తర్వాతే ఇంటినుంచి బైటకు వెళ్లాలి. ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే అత్యంత అలర్ట్ గా ఉండాలి. దాహాం వేసిన వేయకున్న తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఫ్రూట్స్ జ్యూస్ లను ఎక్కువగా తాగుతుండాలి.
కొందరికి ఎండలో బైటకు వెళ్లినప్పుడు ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుంది. ఇలాంటి వారు వెంటనే తలపై నీళ్లను పొసుకొవాలి. ఒక టవల్ కడ్చిప్ ను నీళ్లలో నాన్చి తలకు కట్టుకొవాలి. ఇలా చేస్తే వడదెబ్బ నుంచి బైటపడోచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)