Salman Khaans Property Worth Value Shocking: భారత సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆస్తులకు వారసుడు ఎవరో అనే చర్చ జరుగుతోంది. అతడి వేలాది కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయనే వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
సల్మాన్ ఖాన్ మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను శాసిస్తున్నాడు. సల్మాన్ ఖాన్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆస్తికి సంబంధించిన చర్చలు మారుతున్నాయి. 58 ఏళ్లు పూర్తయినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
సల్మాన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో చాలాసార్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఏది నిజం కాలేదు. తనకు పెళ్లిపై ఆసక్తి తగ్గిందని సల్మాన్ ఖాన్ ఇటీవల బహిరంగంగా చెప్పాడు. తాను పెళ్లి చేసుకోలేనని ప్రకటించేశాడు. అయితే బాలీవుడ్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉంటాడు. అతడికి భారీగా ఆస్తులు, సంపాదన ఉన్నాయి.
పెళ్లి చేసుకోనని చెప్పడంతో అతడి వేల కోట్ల ఆస్తికి వారసుడు ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తికి వారసుడు ఎవరు అనేది సల్మాన్ ఖాన్ ప్రకటించాడు.
తన ఆస్తిలో సగం ట్రస్టుకు విరాళంగా ఇస్తానని ఆ ఇంటర్యూలో తెలిపాడు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆస్తిలో సగభాగం ట్రస్టుకే ఇస్తానని ప్రకటించాడు.
పెళ్లి చేసుకోకపోవడంతో అతడి ఆస్తి మొత్తం ట్రస్ట్‌కు విరాళంగా అందనుంది. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను సల్మాన్ ఖాన్ స్థాపించిన విషయం తెలిసిందే.
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్య ఆరోగ్య సేవలను బీయింగ్ హ్యుమ్ ఫౌండేషన్ అందిస్తుంది. ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
కోట్ల విలువైన వాహనాలతో పాటు భవనాలు, స్థిర చరాస్తులను కలిగి ఉన్న సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 3 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
అయితే సల్మాన్ ఖాన్ తన ఆస్తిని తన నలుగురు సోదరులకు పంచుతానని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అతడి ఆస్తులకు వారసుడిపై మాత్రం స్పష్టత లేదు.