Diabetes Patches: నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయం నుంచి జీవనశైలి వరకు ఎన్నో జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు సాధారణంగా మందులు, ఇంజెక్షన్‌లను ఉపయోగిస్తారు కానీ మీరు ఎప్పుడైనా డయాబెటిస్ ప్యాచ్ గురించి విన్నారా..? అసలు డయాబెటిస్ ప్యాచ్ అంటే ఏమిటి..? ఎలా పనిచేస్తుంది..? ఎవరు దీని ఉపయోగించవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తుంటారు.
ఈ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు, టెస్ట్‌లు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వారి షుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నాయా లేదా అనే వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం కాలంలో చాలా మంది సినీ తారులు, కొంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ ప్యాచెస్‌లను ఉపయోగిస్తున్నారు. దీని చర్మంపై స్టిక్కర్ లా అతికించుకుంటున్నారు.
ఆరోగ్యనిపుణుల ప్రకారం ఈ ప్యాచెస్‌లో ఇన్సులిన్ లేదా మందులకు ఉంటాయి. ఇది అతికించడం వల్ల క్రమం తప్పకుండా శరీరానికి ఈ మందు విడుదలవుతుందని చెబుతున్నారు.
దీని వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. తాజాగా ఈ ప్యాచ్‌ను హీరోయిన్ కత్రినా కైఫ్ ఫెస్టివల్ లుక్ లో కనిపించింది.
ఈ ప్యాచ్‌లో చిన్న చిన్న సూదులు ఉంటాయి.ఇందులోని సూదులు చర్మాని చొచ్చుకుని మందును లోపలికి పంపుతాయి.
కొన్ని అధునాతన ప్యాచెస్ స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ అయి రక్తంలో చక్కెర స్థాయిలను నిరంతరం మానిటర్ చేస్తాయి.
ఈ ప్యాచ్‌లు ఇంజెక్షన్ల భయం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.