Rishabh Pant Girlfriend: టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ లవర్ ను ఎవరో తెలుసా?

Rishabh Pant Girlfriend: టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మధ్య ప్రేమాయణం సాగిందని గతంలో కొన్ని వార్తలొచ్చాయి. అయితే తన ప్రేయసి ఆమె అంటూ ఓ యువతిని పరిచయం చేశాడు పంత్.. ఇంతకీ ఆమె పేరేంటి? ఆమె గురించి వివరాలు తెలుసుకోండి.

  • Dec 10, 2021, 19:50 PM IST

Rishabh Pant Girlfriend: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుస్తున్నాడు. జట్టులో సొగసరి వికెట్ కీపర్ కు ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ తో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా అనేక సార్లు వార్తల్లొకెక్కాడు. అయితే బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలాతో రిలేషన్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని నెటిజన్లు అంటున్నారు.

రిషభ్ పంత్ ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ ఇషా నేగితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో రిషభ్ పంత్ బయటపెట్టాడు. వారిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోలూ వైరల్ అయ్యారు. అసలు ఎవరీ ఇషా నేగి? ఆమెకు సంబంధించిన విషయాలేమిటో తెలుసుకుందాం.

1 /5

రిషభ్ పంత్ ప్రేయసి ఇషా నేగి.. డెహ్రాడూన్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది.

2 /5

ఇషా నేగికి సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ లో లక్ష 70 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

3 /5

ఐపీఎల్ 2021 సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషభ్ పంత్ యూఏఈ వెళ్లగా.. ఆమె కూడా యూఏఈ పర్యటనకు వెళ్లింది. అయితే ఇషా నేగికి సంబంధించిన కొన్ని కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

4 /5

2019 జనవరి 16న రిషభ్ పంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రేయసి ఇషా నేగితో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

5 /5

ఇషా నేగి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఆమెకు సంబంధించిన వీడియోలు, పిక్స్ తరచూ షేర్ చేస్తుంటుంది.