Foods Help In Joint Pains: కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండి

Foods Help In Joint Pains: సాధారణంగా చాలా మంది కీళ్లనొప్పుల సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా వృద్ధ్యాప్యంలో ఈ సమస్యను ఎదుర్కొంటారు. మరి కీళ్ల నొప్పులు తగ్గాలి అంటే ఏం చేయాలి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఇక్కడ తెలుసుకుందాం పదండి..

  • Jan 12, 2024, 17:14 PM IST
1 /5

చాలా మంది వృద్ధులు కీళ్ల నొప్పి, ఎముకల నొప్పితో బాధపడుతుంటారు. దీని కారణంగా వారి పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకుంటారు. ఈ సమస్యలు రావడానికి కారణం శరీరంలో కాల్షియం ఎక్కువగా ఉంటే ఈ సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయట పడవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2 /5

ఎముకలు బలంగా ఉండాలి అంటే ఎల్లప్పుడు పాలు, నెయ్యి, పెరుగు వంటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో కాల్షియం అధికశాతంలో లభిస్తుంది.   

3 /5

సోయాబీన్‌లు ఎక్కడ కనిపించిన మీరు దీనిని తప్పకుండా మీ డైట్‌ లో భాగంగా తీసుకోండి. ఇందులో ఎముకలను, కీళ్లను బలంగా తయారు చేసే శక్తి దాగి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

4 /5

శరీరంలో ఎముకలు, కీళ్లు బలంగా ఉండాలి అంటే విటమిన్‌ డి లభించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా రాగులను తీసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో లభించే విటమిన్‌ డి ఎముకలను  దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతుంది.

5 /5

ప్రతిరోజు ఒక అరటిపండు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఎముకలను బలంగా తయారు చేయడంలో సహాయపడుతుంది. గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా పాటించే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.