Weight Loss Breakfast: బెల్లీ ఫాట్ తగ్గించుకునేందుకు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ మెను!

Weight Loss Breakfast: మీరు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా? అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే చాలు. అవేంటో మీరూ తెలుసుకోండి. 
 

  • Dec 14, 2021, 09:32 AM IST

Weight Loss Breakfast: ప్రతిరోజూ తినే బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక బరువుతో లేదా బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వాళ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలిగే ప్రమాదం ఉంది. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు కొన్ని ఆహార నియమాలూ పాటించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.    

 

1 /5

ఉదయం పూట ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. పెరుగు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే క్యాల్షియం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదే సమయంలో, ప్రోటీన్ స్థాయిలు శరీర కొవ్వును క్రమబద్ధీకరిస్తాయి.   

2 /5

ఉప్మా అంటే సాల్ట్‌పెట్రేతో కూడిన ఫైబర్. శరీరానికి అవసరమైన సరైన బరువును మెయిన్ టైన్ చేసేందుకు ఉప్పు సహాయపడుతుంది. ఉప్మా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచి హానీకర కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అయితే దీని కోసం చాలా తక్కువ నూనె వాడడం శ్రేయస్కరం.   

3 /5

ఉడికించిన కోడిగుడ్లలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. అల్పాహారంలో గుడ్లు తినడం ఆరోగ్యకరమైన ఎంపిక.  

4 /5

ఇది ఫైబర్ కు సరైన మూలం. పెసరట్టులో డైజెస్టివ్ ఫైబర్‌తో పాటు మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. అల్పాహారం కోసం ఇది చాలా ఆరోగ్యకరమైన ఎంపిక. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  

5 /5

విటమిన్-ఈ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఫ్లాక్స్ అవిసె గింజల్లో కనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీటిలో అవిసె గింజల పొడిని తినడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఇలానే కాకుండా.. అవిసె గింజలను సరాసరి తినేయోచ్చు.