Garlic Reduces Belly Fat: వెల్లుల్లితో ఈ 5 రకాలుగా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే మాయం

Garlic Reduces Belly Fat: ఆధునికీ బిజీ ప్రపంచంలో బెల్లీ ఫ్యాట్ సమస్య అధికమైంది. నలుగురిలో అసౌకర్యం కల్గించడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది. మీరు కూడా బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతుంటే వెల్లుల్లి అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. 

Garlic Reduces Belly Fat: వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ అనే కాంపౌండ్ ఇందుకు దోహదపడుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించి శరీరంలో మెటబోలిజం వేగవంతం చేస్తుంది. వెల్లుల్లితో బరువు తగ్గించే పద్ధుతులేంటో తెలుసుకుందాం.

1 /5

వెల్లుల్లి రసం 4-5 వెల్లుల్లి రెమ్మల రసం తీసి అందులో ఒక స్పూన్ తేనె కలిపి పరగడుపున తాగాలి. ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది. 

2 /5

వెల్లుల్లి ఆయిల్ వెల్లుల్లి ఆయిల్ చర్మానికి రాయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. రోజూ రాత్రి వేళ పడుకునేముందు వెల్లుల్లి నూనెతో మసాజ్ చేసుకోవాలి. 

3 /5

వెల్లుల్లి సూప్ సూప్‌లో వెల్లుల్లి వేయడం వల్ల రుచే మారిపోతుంది. బరువు తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ఏ సూప్‌లోనైనా కలిపి తీసుకోవచ్చు

4 /5

వెల్లుల్లి టీ ఓ కప్పు వేడి నీటిలో 2-3 వెల్లుల్లి రెమ్మలు దంచి వేయాలి. ఓ 5 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత వడకాచి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిది.

5 /5

పచ్చి వెల్లుల్లి తినడం ఉదయం లేవగానే పరగడుపున 2-3 వెల్లులి రెమ్మలు పచ్చిగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చివి తినలేకుంటే నీళ్లతో మింగవచ్చు. లేదా నచ్చిన కూరలో కలిపి తినవచ్చు.