Mahashivaratri 2024: దక్షిణ భారతదేశంలోని 5 శివాలయాలు.. ఈ మహాశివరాత్రికి తప్పక సందర్శించండి..

Lord Shiva Famous Temples: హిందూమతంలో శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. దేశవ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ మహాశివరాత్రికి మీరు కూడా ఏదైన ప్రఖ్యాతిగాంచిన శైవాలయానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే, దక్షిణ భారతదేశంలోని ఈ 5 శివాలయాల్లో ఏదైనా ఒకటి సందర్శించండి..
 

1 /5

శ్రీకాళహస్తీశ్వర దేవాలయం.. మన భారతదేశంలో అత్యంత పురాతమైన దేవాలయాల్లో శ్రీకాళహస్తి ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఇక్కడి ఆలయ గాలిగోపురం. మహాశివరాత్రిరోజు అత్యంత వైభవోపేతంగా కనిపిస్తుంది ఈ ఆలయం. ఈ దేవాలయంలో రాహుకేతు పూజ అత్యంత ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని అనుసరించేవారు ఈ ఆలయానికి వచ్చి రాహుకేతు పూజలు చేస్తారు.

2 /5

శ్రీశైల మళ్లికార్జునస్వామి ఆలయం.. ఈ ఆలయం కూడా దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయం. భ్రమరాంభ మళ్లికార్జున స్వామి ఈ దేవాలయంలో దర్శనమిస్తారు. శ్రీశైలంలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఇది 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలలో ఇది ఒకటి.

3 /5

 రామనాథస్వామి ,రామేశ్వరం .. తమిళనాడులోని రామనాథస్వామి దేవాలంయ ద్వీపలో ఉన్న శైవక్షేత్రం. ఇది కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడే రాముడు సేతువును నిర్మించాడని నమ్ముతారు. రావణున్ని చంపిన తర్వాత బ్రహ్మహత్య దోషం తొలగించుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేస్తాడు. అందుకే ఈ ఆలయం పేరు రామేశ్వరంగా పేరొందింది.

4 /5

తిరువణ్ణామలై.. ఇది కూడా తమిళనాడులో ఉంది. అరుణాచలం ఇది పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం చోళ సామ్రాజ్య కాలంలో నిర్మించింది. భారతదేశంలో ఎత్తైన గోపురాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మహాశివరాత్రి అత్యంత విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా విమానాశ్రయం, బస్సు సౌకర్యం కలిగి ఉంది.

5 /5

కైలాసనాథర్ ఆలయం.. ఇది ద్రావిడ వాస్తు శిల్ప శైలికి ఉదాహరణ. 700 CE లో నరసింహ వర్మన్ 2 దీన్ని నిర్మించారు. ప్రధానంగా ఈ ఆలయం ఇసుకరాయితో నిర్మించారు. కైలాసనాథర్ ఆలయం కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మహాశివుని ఆరాధన ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.