Good Luck Plants: ఇంటికి వెలుగుని, ధన సంపదలను తెచ్చే 5 ముఖ్యమైన మొక్కలివే

Good Luck Plants: వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కల్ని ఇంట్లో ఉంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటే ఆ ఇంట్లో డబ్బులు లేదా సంపద ఆదా అవుతుందని నమ్మకం. అందుకే ఈ మొక్కల్ని ఇతరులకు బహుమతిగా ఇచ్చినా మంచి ఫలితాలే ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

Good Luck Plants: హిందూమత వాస్తు ప్రకారం ఇంట్లో అమర్చే ప్రతి వస్తువుకు ఓ మహత్యం ఉంటుంది. ఓ దిశ ఉండాలి. అంటే ఏది ఎక్కడుండాలో తెలుసుకోవాలి. వాస్తు హిందూమతంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకుంది. 
 

1 /5

వెదురు మొక్కను వాస్తుప్రకారం లక్కీ ప్లాంట్ అంటారు. ఈ మొక్క ఇంట్లో ధనం, డబ్బులు, , సౌభాగ్యం లభిస్తాయంటారు. అంతేకాకుండా ఈ మొక్క ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇదొక ఇండోర్ ప్లాంట్. గాలిని శుభ్రం చేసేందుకు దోహదపడుతుంది.

2 /5

చామంతి పూల మొక్క గణేశుడికి, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైంది. ఈ మొక్కను బహుమతిగా ఇస్తే ఇంట్లో అంతా లాభం చేకూరుతుంది. పసుపు రంగుతో ఇంట్లో ప్రత్యేక వెలుగు సంతరించుకుంటుంది.

3 /5

ఎవరికైనా బహుమానంగా  లిల్లీ మొక్కను ఇవ్వవచ్చు. దీనివల్ల ఇంట్లో ఉండే అశాంతి దూరమౌతుంది. ఈ మొక్కను సౌభాగ్యం, శాంతికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరితమౌతుంది.

4 /5

ఎవరిదైనా ప్రత్యేక రోజును మరింత ప్రాముఖ్యమైందిగా చేసేందుకు బహుమతిగా మనీ ప్లాంట్ మొక్క ఇవ్వడం మంచి ప్రత్యామ్నాం. ఇది అందంగా ఉండటమే కాకుండా చాలా లక్కీ ప్లాంట్‌గా చెబుతారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనం సమృద్ధిగా లభిస్తుంది.

5 /5

వాస్తుశాస్త్రంలో చాలా మొక్కల్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వడాన్ని ప్రస్తావించి ఉంది. ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ఆ ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే మొక్కల్ని నాటితే చాలా మంచి జరుగుతుందని అర్ధం.