Tollywood నటుడు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. షాకింగ్ ట్వీట్

 మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. కొన్ని రోజుల మెగా ఫ్యామిలీ నుంచి కొందరు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేటి ఉదయం తనకు కరోనా పాజిటివ్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించాడు. అంతలోనే తనకు సైతం కరోనా సోకినట్లు హీరో వరుణ్ తేజ్ ప్రకటించాడు.

  • Dec 29, 2020, 17:04 PM IST

Varun Tej Tests Positive for CoronaVirus: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. కొన్ని రోజుల మెగా ఫ్యామిలీ నుంచి కొందరు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేటి ఉదయం తనకు కరోనా పాజిటివ్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రకటించాడు. అంతలోనే తనకు సైతం కరోనా సోకినట్లు హీరో వరుణ్ తేజ్ ప్రకటించాడు.

1 /5

Varun Tej Tests Positive for COVID-19: మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. కొన్ని రోజుల మెగా ఫ్యామిలీ నుంచి కొందరు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేటి ఉదయం తనకు కరోనా పాజిటివ్ అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)​ ప్రకటించాడు. అంతలోనే తనకు సైతం కరోనా సోకినట్లు హీరో వరుణ్ తేజ్ ప్రకటించాడు. (Photos: Varun Tej Twitter) Also Read: Ram Charan: రామ్ చరణ్‌కు కరోనా వైరస్.. ట్వీట్ చేసిన మెగాపవర్ స్టార్

2 /5

మెగా ప్రిన్స్, టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్(Varun Tej) కరోనా వైరస్ బారిన పడ్డాడు. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిపాడు. ఈరోజు తనకు కరోనా నిర్ధారణ అయినట్లు రిపోర్ట్ వచ్చిందన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు. క్రిస్మస్ సెలబ్రేషన్ సమయంలో గమనిస్తే అన్న రామ్ చరణ్ పక్కన నిలుచుని వరుణ్ తేజ్ ఫొటోలకు పోజులివ్వడం తెలిసిందే.

3 /5

తనకు కరోనా వైరస్ సోకినట్లు వరుణ్ తేజ్ తెలిపిన ట్వీట్ పోస్ట్ ఇది. త్వరలోనే తాను కోలుకుంటానని, తన మీద ప్రేమ చూపించే అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. Gallery: Pragya Jaiswal Photos: అందాల ‘కంచె’లో బిగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

4 /5

వరుణ్ తేజ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలిసి మరోసారి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 మూవీలో నటిస్తున్నాడు. ఆయనకు కరోనా సోకడంతో షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. (Photos: Varun Tej Twitter)

5 /5

తనకు కరోనావైరస్ సోకినట్టు తెలిపారు రామ్ చరణ్. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టిన రామ్ చరణ్.. తనను ఇటీవల కాలంలో కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలి అని కోరారు. (Photos: Ram Charan Twitter) Gallery: Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు