Gudiko Gomata: ‘గుడికో గోమాత’ కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో ‘గుడికో గోమాత’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
  • Dec 11, 2020, 14:42 PM IST

TTD ‘Gudiko Gomata’ programme: హైదరాబాద్: తెలంగాణలో ‘గుడికో గోమాత’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

1 /4

హిందూ సనాతన ధర్మంలో ఆవుల రక్షణ, గోపూజకు ప్రత్యేక స్థానం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రమంతటా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జిల్లాల్లోని ఐదు నుంచి పది దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గోవులను దానం చేయాలని నిర్ణయించిందని తెలిపారు.  

2 /4

గుడికో గోమాత కార్యక్రమాన్ని మరింతగా అమలు చేయడానికి ఆవులను టీటీడీకి దానం చేయాలని వైవీ సుబ్బారెడ్డి భక్తులను కోరారు. త్వరలో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో కూడా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

3 /4

ఈ కార్యక్రమంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచారం పరిషత్ సభ్యులు హాజరయ్యారు. 

4 /4