Odisha Train Accident News: ఒడిశా మూడు ట్రైన్లు ఢీకొట్టిన ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘోర దుర్ఘటన దృశ్యాలు భయాందోళనకు గురిచేశాయి. అయితే విస్తుపోయే దృశ్యాలను సినిమాల్లో ఎప్పుడో తీశారు. రైలు ప్రమాదాలపై బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ట్రైన్ యాక్సిడెంట్‌పై తీసిన కొన్ని సినిమాలు ఏవో తెలుసుకోండి..
వినోద్ ఖన్నా, ధర్మేంద్ర, హేమమాలిని, జీతేంద్ర, పర్వీన్ బాబీ, డానీ వంటి స్టార్స్ కలిసి నటించిన మూవీ ది బర్నింగ్ ట్రైన్. ఈ మూవీ కథలో కదులుతున్న రైలుకు మంటలు అంటుకుంటాయి. ఆ తరువాత బ్రేకులు కూడా ఫెయిల్ అవుతాయి. దీంతో ట్రైన్‌లో ఉన్న వేల మంది ప్రాణాలు కాపాడే క్రమంలో ట్విస్టులు, సన్నివేశాలు ఉత్కంఠతను రేపుతాయి.
డిజాస్టర్ ఆన్ ది కోస్ట్‌లైనర్ అనే అమెరికన్ టెలివిజన్ యాక్షన్ డ్రామా చిత్రం 1979లో వచ్చింది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొట్టిన ఘటన ఆధారంగా ఈ సినిమా కథను తెరకెక్కించారు.
నిజ జీవితంలో జరిగిన ప్రమాదం ఆధారంగా అన్‌స్టాపబుల్ సినిమాను రూపొందించారు. 2010 అమెరికన్ డిజాస్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి టోనీ స్కాట్, డెంజెల్ వాషింగ్టన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవిత CSX 8888 సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రన్అవే రైలు 1985లో విడుదలైంది. ట్రైన్‌లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఆ రైలు అలాస్కా మంచులో రన్నింగ్‌లో ఉంటుంది. ఈ చిత్రం ఆస్కార్‌కి కూడా నామినేట్ అయింది.
థ్రిల్లర్, హారర్ చిత్రం డి-రైల్డ్ 2019లో విడుదలైంది. రైలు ప్రమాదం తర్వాత నదిలో పడిపోతుంది. ప్రజలు మునిగిపోతున్న రైలులో చిక్కుకుంటారు. ఆ తరువాత ఏం జరిగిందనేది స్టోరీ.