Mohan Babu Top Movies: తెలుగు సినీ చరిత్రలో మోహన్ బాబుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక నటుడిగా, నిర్మాతగా.. విద్యా సంస్థల అధినేతగా ఆయన కంటూ సెపరేట్ ప్లేస్ ఉంది. అంతేకాదు తెలుగో హీరోగా ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ తర్వాత ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. మళ్లీ స్టార్ హీరో సత్తా చూపెట్టిన ఏకైక భారతీయ నటుడు మోహన్ బాబు మాత్రమే. ఈయన కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
పెదరాయుడు.. మోహన్ బాబు ద్విపాత్రాభినయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 'పెదరాయుడు'. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఎన్నో రికార్డులను మడతపెట్టేసింది. ఈ సినిమా తర్వాత మోహన్ బాబుకు పెదరాయుడు పేరు అనేది పర్యాయపదంగా మారింది.
అల్లుడు గారు.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లుడు గారు' సినిమాతో హీరోగా పునర్వభవం అందుకున్నారు మోహన్ బాబు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈయన కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉంది.
అసెంబ్లీ రౌడీ.. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అసెంబ్లీ రౌడీ' సినిమాతో మోహన్ బాబు దశ తిరిగింది. ఈ సినిమా సక్సెస్‌తో ఈయన పేరు ముందు నట ప్రపూర్ణ కాకుండా.. కలెక్షన్ కింగ్ బిరుదు వచ్చి చేరింది. ఈ మూవీ తర్వాత హీరోగా మోహన్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు.
మేజర్ చంద్రకాంత్.. మోహన్ బాబు హీరోగా నటిస్తూ.. అన్న ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా 'మేజర్ చంద్రకాంత్'. నటుడిగా ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అన్నగారి చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో మోహన్ బాబు మరో హీరోగా నటిస్తూ నిర్మించడం విశేషం. ఈయన కెరీర్‌లో డిఫరెంట్ చిత్రంగా నిలిచిపోయింది.
బ్రహ్మ.. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మ' మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్, ఐశ్వర్య హీరో, హీరోయిన్స్‌గా నటించారు. బప్పీలహరి సంగీతం అందించారు.
అడవిలో అన్న బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అడవిలో అన్న' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రోజా కథానాయికగా నటించింది.
రౌడీ గారి పెళ్లాం.. రౌడీ గారి పెళ్లాం సినిమాను కే.రాఘవేంద్రరావు తమ్ముడు కే.యస్.ప్రకాష్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
అల్లరి మొగుడు.. కే.రాఘవేంద్రరావు తన సొంత బ్యానర్ ఆర్.కే.ఫిల్మ్ అసోసియేట్స్ పై 'అల్లరి మొగుడు' సినిమాను తెరకెక్కించారు. రమ్యకృష్ణ, మీనా హీరయిన్స్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
శ్రీరాములయ్య.. ఎన్. శంకర్ దర్శకత్వంలో పరిటాల రవి నిర్మాతగా మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన 'శ్రీరాములయ్య'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.
కలెక్టర్ గారు.. బెజవాడ గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా 'కలెక్టర్ గారు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలతో పాటు మోహన్ బాబు కెరీర్‌లో పలు సూపర్ హిట్ చిత్రాలున్నాయి.