Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..

Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ కోటా దర్శనం, గదుల వసతి, శ్రీవారి సేవకు సంబంధించిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

1 /5

ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా ఈ మాసం నవంబర్‌ నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టిక్కెట్ల కోటా ఇతర షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. టిక్కెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో కూడా చేసుకోవచ్చు.  

2 /5

శ్రీవారి ఆర్జిత సేవలను ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉదయం 10 గంటల నుంచి ఆగష్టు 19 నుంచి 21 వరకు అందుబాటులో ఉంచనుంది. ఆ మరుసటి రోజు ఆగష్టు 22వ తేదీ ఉదయం కల్యాణం, ఉంజాల్‌ సేవ, ఆర్జిజ బ్రాహ్మత్సవం బుక్‌ చేసుకోవచ్చు. అదేరోజు, మధ్నాహ్నం 3 గంటల నుంచి సహస్ర దీపాళంకరణ సేవ, వర్చూవల్‌ సేవ టిక్కెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది.  

3 /5

అంగప్రదక్షిణం టిక్కెట్లను ఆగష్టు 23 ఉదయం 10 గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చు. దర్శనం, వసతి గదులుకు సంబంధించిన శ్రీవారి ట్రస్ట్‌ డోనర్స్ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది.  సీనియర్‌ సిటిజెన్లు, దివ్యాంగుల కోటా అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంచునున్నారు.  

4 /5

ఇక ప్రత్యేక దర్శనం రూ.300 టిక్కెట్లను ఆగష్టు 24 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచునున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి గదుల వసతికి కూడా బుకింగ్స్‌ సౌకర్యం కల్పించనున్నారు.  

5 /5

 ఆగష్టు 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి నవనీత సేవ, పరకామణి సేవ మధ్యాహ్నం 1 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)